రష్యా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న నరేంద్ర మోదీ
రష్యా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న నరేంద్ర మోదీ
రష్యా అత్యున్నత పౌర పురస్కారం "ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్" (Order of St Andrew the Apostle) ను వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు.
• రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలోనూ, ఇరుదేశాల మధ్య మైత్రీబంధం పటిష్టతకు, పరస్పర అవగాహన పెంపొందేందుకు చేసిన విశేష సేవకు గుర్తింపుగా 2019లో మోదీకి ఈ అవార్డును ప్రకటించారు.
• ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు.
సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం గురించి:
• "ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్" రష్యా యొక్క అత్యున్నత దేశ పురస్కారం. దీనిని 1698లో జార్ పీటర్ ది గ్రేట్ "సెయింట్ ఆండ్రూ" గౌరవార్థం దీనిని ప్రారంభించారు.
• సెయింట్ ఆండ్రూ యేసు మొదటి బోధకుడు. ఆయన పేరు మీదనే ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీకి పలు దేశాల అత్యున్నత పురస్కారాలు
"స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్" (2016) - ఆఫ్ఘనిస్తాన్
"గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా"(ఫిబ్రవరి 2018)-పాలస్తీనా
"యూఎస్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు" (అక్టోబర్ 2018) - ఐక్యరాజ్యసమితి.
"ఆర్డర్ ఆఫ్ జాయెద్"(ఏప్రిల్ 2019)-దుబాయ్
"ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజ్జుద్దీన్" (జూన్ 2019)- మాల్దీవులు.
"కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్" (ఆగస్టు 2019) -బహ్రెయిన్.
"లెజియన్ ఆఫ్ మెరిట్" (డిసెంబర్ 2020)-అమెరికా.
"ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అవార్డు (డ్రుక్ గ్యాల్పో)" (డిసెంబర్ 2021) -భూటాన్
"ఆర్డర్ ఆఫ్ ఫిజీ" ఫిజీ దేశంచే మరియు "ఆర్డర్ ఆఫ్ లోగోహు" ను పాపువా న్యూ గినియా దేశంచే 2024 మే లో అందుకున్నారు.