సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారిగా పేరు, లింగాన్ని మార్చుకున్న అధికారి
సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారిగా పేరు, లింగాన్ని మార్చుకున్న అధికారి
హైదరాబాద్‌లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం జాయింట్ కమిషనర్ (Authorized Representative)గా పనిచేస్తున్న 35 ఏళ్ల ఎం అనసూయ అన్ని అధికారిక రికార్డుల్లో తన పేరు, లింగాన్ని మార్చాలని అభ్యర్ధన చేసింది.
• చరిత్రలో తొలిసారిగా వచ్చిన ఈ తరహా అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో అన్ని అధికారిక రికార్డుల్లోనూ మహిళను (అనసూయ) ఇకపై పురుషుడిగా (అనుకతిర్ సూర్య) ప్రభుత్వం పరిగణించనుంది.
• సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్ గా పదోన్నతి పొందిన సూర్య గతేడాది నుంచి హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.
• చెన్నెలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అనుకతిర్ బీటెక్ పూర్తిచేశారు.
• ఉద్యోగంలో చేరిన తర్వాత భోపాల్‌లో నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ లో పీజీ డిప్లొమాను అందుకున్నారు.