ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం "డెత్ వ్యాలీ"
ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం "డెత్ వ్యాలీ"
ఎండ ఎలా ఉంటుందో చూసేందుకు ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఎండ తీవ్రతకు ఇటీవల ఓ బైక్ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు హాస్పిటల్ పాలయ్యారు. "డెత్ వ్యాలీ నేషనల్ పార్క్" యాజమాన్యం వద్దని వారిస్తున్నా పర్యాటకుల రాక మాత్రం ఆగడం లేదు. జులై 7,8 రెండు రోజులు ఇక్కడ 53.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
1913 జూలైలో ఇక్కడ అత్యధికంగా 56.67 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
"డెత్ వ్యాలీ" ఇది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఉంది. ఇక్కడ 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
• ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొన్ని ప్రదేశాలు29 మే 2024న ఢిల్లీలోని ముంగేష్ ప్పూర్ లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఇది భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశంగా నిలిచింది.
• రాజస్థాన్లోని ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది (ముంగేష్ పూర్ కంటే ముందు, రాజస్థాన్లోని ఫలోడి 51 డిగ్రీల సెల్సియస్ వద్ద భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా రికార్డు సృష్టించింది) హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో 48 డిగ్రీల సెల్సియస్, ఢిల్లీలోని నరేలాలో (47.9 డిగ్రీల సెల్సియస్), హర్యానాలోని రోహక్ లో (47.7 డిగ్రీల సెల్సియస్), రాజస్థాన్ లోని బికనీర్ లో (47 డిగ్రీల సెల్సియస్) నమోదయ్యాయి.