Budget 2024: పింఛన్దారులకు శుభవార్త..! అటల్ పెన్షన్ ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
Budget 2024: పింఛన్దారులకు శుభవార్త..! అటల్ పెన్షన్ ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
అటల్ పింఛన్దారులకు శుభవార్త!
ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
ప్రకటన చేస్తే నెలకు రూ.10 వేలు పెన్షన్!
త్వరలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో అటల్ పెన్షన్ దారులకు శుభవార్త చెప్పే యోచనలో ఉంది. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక జూలై 23న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో పలు వర్గాలపై వరాలు కురిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాముఖ్యంగా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అందించే పింఛన్ ముత్తాన్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. గ్యారెంటీ పెన్షన్ మొత్తాన్ని రూ.5 వేలు నుంచి రూ. 10 వేలకు పెంచాలని చూస్తోంది. అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారెంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు వార్త కథనాలు వెలువడుతున్నాయి.
ఎలాంటి పింఛను పథకాలకు నోచుకోని వారికోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 బడ్జెట్లో ప్రకటించారు. నెలకు రూ.1000- 5000 వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. అందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.