అభివృద్ధికి అడ్డొస్తే తొక్కుతా - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
అభివృద్ధికి అడ్డొస్తే తొక్కుతా - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
• Dr. బైరెడ్డి శబరి వ్యక్తి కాదు శక్తి
• నంద్యాల పార్లమెంట్ అభివృద్దే లక్ష్యం
• సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజాసేవ చేసేందుకే వచ్చాం.
• నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్న శబరికి అండగా నిలువండి
• విజనరీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు
• కాటసాని రౌడీ రాజకీయం చేస్తే గుండుకొట్టించి సున్నం బొట్లు పెట్టి ఊరేగిస్తా.
• నందికొట్కూరులో మా పార్టీ వల్లే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు వారికీ ప్రజలే గుణపాఠం చెబుతారు.
• పసుపుమయమైన నందికొట్కూరు
• నంద్యాల ఎం. పి. Dr. బైరెడ్డి శబరికి అపూర్వ ఘన స్వాగతం
• జై బైరెడ్డి నినాధాలతో మారుమ్రోగిన నందికొట్కూరు
• బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, MP బైరెడ్డి శబరిలపై పూలవర్షం
నందికొట్కూరు, జులై 08 (పీపుల్స్ మోటివేషన్):-
అభివృద్ధికి ఎవరు అడ్డుగా నిలిచినా తొక్కుకుంటూ ముందుకు సాగుతామని, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్దే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలుగా ఘన విజయం సాధించి తొలిసారి సొంత గడ్డ నందికొట్కూరుకు వచ్చిన Dr. బైరెడ్డి శబరికి అపూర్వ ఘన స్వాగతం లభించింది.
సోమవారం నందికొట్కూరు RTC బస్టాండ్ సమీపంలోని బైరెడ్డి కాంప్లెక్స్ కు MP Dr. బైరెడ్డి శబరి చేరుకోగానే వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బైరెడ్డి అభిమానులు ఎదురేగి భారీ గజమాలతో స్వాగతం పలికి సత్కరించారు.
బైరెడ్డి కాంప్లెక్స్ లోని టీడీపీ కార్యాలయం నుంచి ఓపెన్ టాప్ వాహనంపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, MP Dr. బైరెడ్డి శబరి, బైరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు Dr. కాకరవాడ చిన్న వెంకటస్వామి తదితరులు వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
డప్పు వాయిద్యాలు, మేళా తాళాలు, భజనలు, వివిధ వేషాధారణ నృత్యాల ఆనందోత్సవాల పండుగ వాతావరణం మధ్య KG రోడ్డు గుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సెంటర్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి శబరి ల భారీ కటౌట్లు, బ్యానర్లు, ప్లెక్సీ లతో నందికొట్కూరు పట్టణం పసుపు మాయం అయింది.
పటేల్ సెంటర్ లో జరిగిన బహిరంగసభలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శబరి విజయానికి కృషి చేసిన మీ అందరికి పేరు పేరునా ధన్యవాదములు అన్నారు. శబరి వ్యక్తి కాదు శక్తి అని ఇటీవల పార్లమెంట్ వేదిక ద్వారా నిరూపణ అయిందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో కొందరు చిల్లర రాజకీయాలు మొదలుపెట్టారు, వారికీ ప్రజలే గుణపాఠం చెబుతారని బైరెడ్డి స్పష్టం చేశారు. తనపైన, తన కూతురు శబరిపై చంద్రబాబుకు లేనిపోని అవాస్తవాలు చెప్పారని, అది లెక్క చేయకుండా శబరికి నంద్యాల MP టిక్కెట్ ఇచ్చారని, మీ అందరి దీవెనలతో శబరి MP గా విజయం సాధించారన్నారు. మీ కష్టాలు తొలగించేందుకు శబరి పనిచేస్తుందని బైరెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధికి సహకరించండి, అవినీతికి పాల్పడితే, ప్రజలను పిడిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదిలేదని, తాట తీస్తానని బైరెడ్డి హెచ్చరించ్చారు. జై తెలుగుదేశం, జై NTR, జై చంద్రబాబు అంటూ బైరెడ్డి నినదించడంతో ఒక్కసారిగా వేలాది గొంతులు కలిసి నినాదాలు చేయడంతో KG రోడ్డు దద్దరిలింది. ఎవరికీ భయపడవద్దు మీకు ఏ కష్టం వచ్చినా మీ బైరెడ్డి ఉన్నాడని మరువవద్దు అని భరోసా ఇచ్చారు.
నంద్యాల MP Dr. బైరెడ్డి శబరి మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా చూడని, చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు, వితంతు, వంటరి మహిళలకు రూ.4 వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు పెంచి ఉద్యోగుల నెల జీతం లా వారి ఇంటి వద్దకే పింఛన్ అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందన్నారు. తన విజయానికి కృషి చేసిన పార్లమెంట్ పరిధిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదములు అని శబరి అన్నారు. మీ సేవకురాలిగా పార్లమెంట్ పరిధిలో పనిచేస్తానని శబరి హామీ ఇచ్చారు.
అనంతరం భారీ ర్యాలీగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళగా MP గా విజయం సాధించి తొలిసారి పుట్టింటికి వచ్చిన బైరెడ్డి శబరికి మహిళలు దిష్టి తీసి, హారతి పట్టి ఆడపడుచును ఇంట్లో కి ఆహ్వానించారు.