-Advertisement-

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు త్వరలో కొత్త టికెటింగ్ వ్యవస్థ..!

Information about Hyderabad metro advance technology daily news Telugu daily political updates latest crime news Telugu breaking news Telugu daily up
Priya
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు త్వరలో కొత్త టికెటింగ్ వ్యవస్థ..!
హైదరాబాద్ మెట్రోలో అడ్వాన్స్డ్ టికెటింగ్ విధానం..
విదేశాల్లో మాదిరిగానే ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్..

 

Information about Hyderabad metro advance technology daily news Telugu daily political updates latest crime news Telugu breaking news Telugu daily updates

హైదరాబాద్ మెట్రోలో అడ్వాన్స్డ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ. విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ (ఓటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది. ఈ విధానంలో మెట్రో రైలు ఎక్కే ముందు టికెట్ కొనాల్సిన పనిలేదు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టాలని మెట్రో రైల్ యోచిస్తోంది. అందుబాటులో ఉంటే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇటీవల ప్రజా రవాణా టిక్కెట్లు మరియు చెల్లింపు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. హైదరాబాద్ మెట్రోలో కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టిక్కెట్ల నుంచి.. టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా టిక్కెట్లు పొందడం, స్మార్ట్ కార్డ్లు, మొబైల్ల నుంచి వాట్సాప్లో టిక్కెట్లు పొందడం.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ల ద్వారా అనుమతించడం వంటివి ఇప్పటివరకు చూశాం.

ఇక నుంచి ఓటీఎస్ ను ప్రవేశపట్టి ప్రయాణికులకు టెక్సన్ లేకుండా ప్రయాణానికి తెరలేపనుంది. ఎందుకంటే హడావుడిగా గమ్యస్థానానికి చేరుకునే వారికి మెట్రో వద్ద టికెట్ తీసుకునేందుకు క్యూ లైన్ లో వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి వెళ్లాల్సిన వారు క్యూ లైన్లో వెయిటింగ్ చేయడం ద్వారా ఆలస్యం అవుతుంది. ఇది గమనించిన మెట్రో సంస్థ ప్రయాణికులు వెయిటింగ్ చేయాల్సిన పనిలేకుండా దిగిన తరువాత టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాన్ని ఓటీఎస్ ద్వారా త్వరలో తీసుకు వచ్చుందుకు సన్నాహాలు చేస్తుంది. దీంతో మోట్రో ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కంపెనీకి గోల్డెన్ పీకాక్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరులో జరిగిన పర్యావరణ నిర్వహణ మరియు వాతావరణ మార్పులపై ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడారు. కార్యాలయంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు మరియు ఆరోగ్యకరమైన పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వడంలో బృందం యొక్క నిరంతర ప్రయత్నాలకు గుర్తింపుగా గోల్డెన్ పీకాక్ అవార్డు అని ఆయన చెప్పారు. మొత్తం 778 దరఖాస్తుల్లో ఎల్ అండ్ టీ మెట్రోకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. KVBR గతంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి తమ ఉద్యోగులు తమ వంతు కృషిని కొనసాగిస్తారని పేర్కొంది.
Comments

-Advertisement-