IBPS Clerk: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదలచేసిన ఐబీపీఎస్.. పూర్తి సమాచారం
IBPS Clerk: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదలచేసిన ఐబీపీఎస్.. పూర్తి సమాచారం
బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ (IBPS Clerk) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం 2025-26 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP-XIV) నిర్వహించనుంది.
బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ (IBPS Clerk) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం 2025-26 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP-XIV) నిర్వహించనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21తో అప్లికేషన్లు ముగియనున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టులో, మెయిన్ ఎగ్జామ్‌ను అక్టోబర్‌లో నిర్వహించనున్నారు.
మొత్తం పోస్టులు: 6128
ఇందులో తెలంగాణలో 104 ఖాళీలు ఉండగా, ఏపీలో 105 పోస్టులు ఉన్నాయి.
ఖాళీలు ఏయే బ్యాంకుల్లో అంటే..
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
అర్హతలు
అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినవారై ఉండాలి. 2024, జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను క్లర్క్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఇతరులకు రూ.175
పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 21
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: ఆగస్ట్ 12 నుంచి 17 వరకు
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్ట్ 24, 25, 31
ప్రిలిమ్స్ ఫలితాలు: సెప్టెంబర్‌లో
మెయిన్స్: అక్టోబర్‌లో
ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2025 ఏప్రిల్
వెబ్‌సైట్: https://www.ibps.in/