-Advertisement-

SSC JOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు..!

SSC nic in ssc.nic.in 2024 SSC Recruitment 2024 ssc.nic.in login ssc.nic.in registration Staff Selection Commission ssc jobs Notifications job news
Pavani

SSC JOBS: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు..!


• పదోతరగతితో కేంద్ర కొలువులు..

• ఎంటీఎస్, హవల్దార్‌ పోస్టులు..

• తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు..

• కేంద్రం వివిధ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 8326

పోస్టుల వారీగా ఖాళీలు

మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ – 4887, హవల్దార్‌ (గ్రూప్‌ సీ నాన్‌ మినీరియల్‌)- 343 ఖాళీలు ఉన్నాయి

అర్హతలు

గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు అర్హులు

వయస్సు

2024, ఆగస్టు 1 నాటికి ఎంటీఎస్‌ పోస్టులకు 18- 25 ఏండ్లు, హవల్దార్‌ పోస్టులకు 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

ఎంటీఎస్‌ పోస్టులకు..

కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.

హవల్దార్ పోస్టులకు..

కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఐటీ)/ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) ద్వారా

• కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్‌/హిందీతోపాటు 13 స్థానిక భాషల్లో కూడా నిర్వహించారు.

• తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు

• ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌, మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది.

• సీబీఈలో రెండు సెషన్లు ఉంటాయి.

• మొదటి సెషన్‌లో న్యూమరికల్‌ అండ్ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు.

• పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు.

• ప్రశ్నల సంఖ్య 40. మార్కులు 120

• సెషన్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్‌వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 150 మార్కులు. అంటే ఒక్క ప్రశ్నకు 3 మార్కులు.

• పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు

పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించగలరు: https://ssc.nic.in/

Comments

-Advertisement-