పన్నీర్ ను ఇష్టంగా తింటున్నారా ? ఇది ఒకసారి వింటే షాక్ అవుతారు..
పన్నీర్ ను ఇష్టంగా తింటున్నారా ? ఇది ఒకసారి వింటే షాక్ అవుతారు..
కల్తీ గాళ్ళకు కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. పిల్లలు తాగే పాల పొడి నుంచి తినే పండ్ల వరకు ప్రతిదీ కల్తీ కనిపిస్తుంది.. అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా కూడా కేటుగాళ్లు ఎక్కడా తగ్గలేదు. ఇదొక విధంగా కల్తీ చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి ఫేక్ పన్నీర్ వచ్చేసింది. అయితే దాన్ని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందా..
అచ్చం పన్నీరులానే ఉన్నా.. ఇది తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఇందులో డిటర్జెంట్, యూరియా వంటివి వాడతారు. ఇవి శరీరంలోకి వెళ్తే ఇక మనం యమపురికి రెడీ అవ్వాల్సిందే.. అందుకే బయట పనీర్ ను కొనే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే మన ప్రాణాలు సేఫ్..అసలు పన్నీర్ గట్టిగ ఉంటుంది. నకిలీ పనీర్ చూడటానికి గట్టిగ ఉన్నా కూడా అది విరిస్తే విరిగిపోతుంది..అలాగే పన్నీర్ ను కాస్త రుచి చూడాలి అది పుల్లగా అనిపిస్తే మాత్రం అది నకిలీది ,లేదా పాడైందని సామాచారం… ఇక కొంత పన్నీర్ ను నీటిలో వేసి ఉడికించాలి. కాస్త చల్లారాక దాన్ని కందిపప్పు పొడిని దానిపై వేసి అది ఎరుపు రంగులోకి మారుతుంది. అందులో యూరియా కలిసినట్లు అర్థం.. ఇలా చిన్న టిప్స్ తో నకిలీ పన్నీర్ను గుర్తించవచ్చు..