JEE Mains 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
JEE Mains 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
• జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
• అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
• నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం..
• వచ్చే ఏడాది జనవరి 22- 31 మధ్య పరీక్ష..
• 2025 ఏప్రిల్లో రెండో సెషన్..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్ ను jeemain.nta.nic.in లో nta.ac.in చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం రోజు అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ గా ఉంటుంది.
జేఈఈ మెయిన్స్ పరీక్షల నమోదు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. పరీక్ష 2025 జనవరి 22- 31 మధ్య నిర్వహించబడుతుంది. ఇందుకోసం పరీక్షకు మూడు రోజుల ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష జరిగే నగరం గురించిన సమాచారం అభ్యర్థులకు ఒక వారం ముందుగానే ఇవ్వబడుతుంది. కాగా.. రెండో సెషన్ ఏప్రిల్లో ప్రారంభమవుతుంది.
Important Dates
• దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 22 నవంబర్ 2024 రాత్రి 09 గంటల వరకు
• ఫీజు డిపాజిట్ చేయడానికి చివరి తేదీ - నవంబర్ 22 నుంచి రాత్రి 11:50 వరకు
• పరీక్ష నగర సమాచారం - జనవరి 2025 మొదటి వారంలో విడుదల చేయబడుతుంది.
• అడ్మిట్ కార్డ్- పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు జారీ చేయబడుతుంది.
• పరీక్ష షెడ్యూల్- 22 జనవరి నుంచి 31 జనవరి 2025 వరకు.
• పరీక్ష ఫలితం- 12 ఫిబ్రవరి 2025
Official Website- nta.ac.in, jeemain.nta.nic.in.