రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఈ కోర్సు పూర్తి చేస్తే నెలకు రూ.70 వేలతో బ్యాంక్లో ఉద్యోగం

Latest Govt Jobs Notifications Government Jobs after 12th Free Job Alert 10th Pass Govt Job Central Government Jobs list Direct recruitment in AP Govt
Peoples Motivation

ఈ కోర్సు పూర్తి చేస్తే నెలకు రూ.70 వేలతో బ్యాంక్‌లో ఉద్యోగం 

• పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల..

• కోర్సు పూర్తి చేసిన వెంటనే బ్యాంక్‌లో ఉద్యోగం..

• తొలి నెల నుంచే రూ.70 వేల వేతనం..

Latest Govt Jobs Notifications Government Jobs after 12th Free Job Alert 10th Pass Govt Job Central Government Jobs list Direct recruitment in AP Govt Jobs Today Govt Jobs Govt Job Alert

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. చేసింది. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. దేశంలో 1000 ఖాళీలున్నాయి. దీంట్లో అవకాశం వచ్చినవారు కోర్సు పూర్తిచేసిన వెంటనే జూనియర్ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌-1 క్రెడిట్‌ ఆఫీసర్‌ హోదాతో సెంట్రల్‌ బ్యాంకులో చేరిపోవచ్చు. తొలి నెల నుంచే రూ.70 వేలకు పైగా వేతనం ఉంటుంది.

ముఖ్య సమాచారం

పీజీడీబీఎఫ్ కోర్సులో 1000 ఖాళీలు ఉన్నాయి. జనరల్‌ 405, ఓబీసీ 270, ఎస్సీ 150, ఎస్టీ 75, ఈడబ్ల్యూఎస్‌ 100.

విద్యార్హత: నవంబరు 30, 2024 నాటికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీలైతే 55 శాతం సరిపోతాయి.

వయసు: నవంబరు 30, 2024 నాటికి 20 - 30 ఏళ్ల లోపు ఉండాలి. అంటే నవంబరు 30, 1994 - నవంబరు 30, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష తేదీ: తర్వాత ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం.దరఖాస్తు 

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. మిగిలిన అందరికీ రూ.750.

కోర్సు వ్యవధి ఏడాది: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 9 నెలల తరగతి గది శిక్షణ, 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు రూ.3 నుంచి 4 లక్షల వరకు చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం. అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంకు రుణం ఇవ్వబడుతుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించవచ్చు. ఐదేళ్లు ఉద్యోగంలో కొనసాగితే కోర్సు ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఐదేళ్ల లోపు వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. రుణం తీసుకున్నవారైతే ఫీజుతోపాటు మొత్తం వడ్డీనీ కట్టాలి.

స్టైపెండ్- వేతనం: కోర్సులో ప్రతి నెలా రూ.2500 చొప్పున మొదటి తొమ్మిది మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ.10,000 చొప్పున 3 నెలల ఉద్యోగ శిక్షణ ఇస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ డిగ్రీ ప్రదానం చేస్తారు. మేనేజ్‌మెంట్, స్కెల్-1లో క్రెడిట్ ఆఫీసర్ హోదాతో జూనియర్ విధుల్లోకి తీసుకున్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.48,480 మూల వేతనం పొందుతారు. దాదాపు రూ.70,000 ప్రతి నెలా జీతం అందుకోవచ్చు.

ఆన్‌లైన్ పరీక్ష: పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. మొత్తం మార్కులతో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరుగుతాయి.విభాగాల వారి కటాఫ్‌ మార్కులు పొందాలి. అలాగే అన్ని విభాగాలూ కలిపి నిర్దేశిత కటాఫ్‌ కంటే ఎక్కువ సాధించాలి. వీటిని బ్యాంకు చేస్తుంది. రుణాత్మక మార్కులు లేవు.

సమయం: 120 ప్రశ్నలకు 90 నిమిషాలు.

డిప్లొమా పూర్తయ్యాక ఉద్యోగంలోకి.. ఇటీవల వివిధ బ్యాంకులు ప్రత్యేక విధుల కోసం కొంతమందిని ఎంపిక చేసి, పీజీ డిప్లొమా పూర్తయ్యాక ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, తిరిగి ఉద్యోగం రెండూ సొంతం అవుతాయి. వీరు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది చదువునూ ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకుని ఎంబీఏ పట్టా పొందే సౌకర్యం ఉంది.

ఇంటర్వ్యూ, తుది ఎంపిక: పరీక్షలో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంత మంది చొప్పున ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. ఈ సంఖ్యను సెంట్రల్ బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి 50 మార్కులు. దీంట్లో 25 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 శాతం 22.5 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితాకు ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కులు కలుపుతారు. కేటగిరీల వారి మెరిట్‌ జాబితా రూపొందించి, కోర్సులోకి తీసుకుంటారు.

అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

-Advertisement-