రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Tenth: 10వ తరగతి విద్యార్థులకు ఇదే ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్

Ap tenth exam Ap tenth result Ap tenth syllabus Ap tenth 2025 SSC marks memo AP bse.ap.gov.in 10th BSE AP gov in 10th results www.bse.ap.gov.in result
Peoples Motivation

Tenth: 10వ తరగతి విద్యార్థులకు ఇదే ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్

Ap tenth exam Ap tenth result Ap tenth syllabus Ap tenth 2025 SSC marks memo AP bse.ap.gov.in 10th BSE AP gov in 10th results www.bse.ap.gov.in result

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ ఫైనల్‌ పరీక్షల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రీ ఫైనల్‌(Pre Final) పరీక్షలు జరగనున్నాయి.

టెన్త్‌ప్రీ ఫైనల్‌ పరీక్షల పూర్తి టైం టేబుల్‌ ఇదే..

>> ఫిబ్రవరి10వ తేదీ ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌ ఏ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1(కాంపోజిట్‌ కోర్సు) పరీక్షలు

>> ఫిబ్రవరి11వ తేదీ సెకండ్‌ లాంగ్వేజ్ పరీక్ష

>> ఫిబ్రవరి12న ఇంగ్లిషు పరీక్ష

>> ఫిబ్రవరి13న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (కాంపోజిట్‌ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్‌) పరీక్ష

>> ఫిబ్రవరి15న గణితం పరీక్ష

>> ఫిబ్రవరి17న భౌతిక శాస్త్రం పరీక్ష

>> ఫిబ్రవరి18న జీవ శాస్త్రం పరీక్ష

>> ఫిబ్రవరి19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్‌), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ) పరీక్ష

>> ఫిబ్రవరి20న సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

ఇకటెన్త్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

Comments

-Advertisement-