IDBI: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐడీబీఐ బ్యాంకులో 650 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్
IDBI: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐడీబీఐ బ్యాంకులో 650 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్
IDBI: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారా. అయితే, త్వరగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి. ఐడీబీఐ బ్యాంకు 650 పోస్టుల భర్తీకీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, గడువు తేదీ, తదితర పూర్తి వివరాలు..
నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు సన్నద్ధమవుతుంటే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమైన వివరాలు:
ఈ నియామకంలో ఎంపికైన అభ్యర్థులు 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రామ్ (PGDBF – Post Graduate Diploma in Banking & Finance) పూర్తి చేయాల్సి ఉంటుంది.
• ఆరు నెలల తరగతి గది పాఠాలు
• రెండు నెలల ఇంటర్న్‌షిప్
• నాలుగు నెలల ఉద్యోగ శిక్షణ (OJT) ఉంటాయి. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు IDBI బ్యాంక్‌లో పూర్తి స్థాయి ఉద్యోగులుగా అవకాశం పొందగలరు.
అర్హతలు (Eligibility):
విద్యార్హత:-
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.
వయో పరిమితి:-
అభ్యర్థుల వయస్సు 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, 01.03.2000 మరియు 01.03.2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:-
ఈ నియామకానికి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది:
ఒకటి ఆన్‌లైన్ పరీక్ష (Objective Type). తప్పుగా సమాధానం ఇచ్చిన ప్రతీ ప్రశ్నకు 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. రెండు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు రుసుము:-
జనరల్/OBC/EWS అభ్యర్థులకు: రూ1050
SC/ST/PwD అభ్యర్థులకు: రూ.250
దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్/మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం:-
మార్చి 1, 2025 నుంచి IDBI అధికారిక వెబ్‌సైట్ (idbibank.in) లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మెరుగుపర్చుకోవచ్చు!
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 1, 2025 నుంచి ఈ కింది అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.