రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏపి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 22 నుంచి అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరణ

https://apkgbv.apcfss.in
Mounikadesk

ఏపి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 22 నుంచి అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరణ

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (AP KGBV) ప్రవేశాలకు మార్చి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తులు https://apkgbv.apcfss.in ద్వారా పొందవచ్చని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. పూర్తి వివరాలు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చని, *సందేహాలకు 70751-59996, 70750-39990 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Comments

-Advertisement-