దుబాయ్ బంగారం తెస్తే ఎందుకు పట్టుకుంటారు.. లీగల్ గా ఎంత తెచ్చుకోవచ్చు?
Gold rates telugu
gold rates near nandyala, andhra pradesh
today gold rate (22 carat)
1 gram gold rate today
Today gold rate kurnool malabar
Gold rate
By
Peoples Motivation
దుబాయ్ బంగారం తెస్తే ఎందుకు పట్టుకుంటారు.. లీగల్ గా ఎంత తెచ్చుకోవచ్చు?
పీపుల్స్ మోటివేషన్ డెస్క్:-
నిబంధనలకు విరుద్ధంగా సుమారు 14 కేజీల అక్రమ బంగారంతో రన్యారావు పట్టుబడడం సంచలనం రేపింది. అయితే.. ఈ ఘటన తర్వాత దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకుంటే ఎందుకు పట్టుకుంటున్నారు?.. దుబాయ్ గోల్డ్కు ఎందుకంత క్రేజ్?.. అసలు.. దుబాయ్ నుంచి మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? నటి రన్యారావు ఎపిసోడ్ తర్వాత అందరి ఫోకస్ దుబాయ్ గోల్డ్పై పడింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 14 కేజీల అక్రమ బంగారంతో రన్యారావు పట్టుబడడం సంచలనం రేపింది. అయితే.. ఈ ఘటన తర్వాత దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకుంటే ఎందుకు పట్టుకుంటున్నారు?.. దుబాయ్ గోల్డ్కు ఎందుకంత క్రేజ్?.. అసలు.. దుబాయ్ నుంచి మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కన్నడ నటి రన్యారావు ఘటనతో అందరూ దుబాయ్ బంగారం స్పెషల్ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నటి రన్యారావే కాదు.. సాధారణంగా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని ఎవరు తీసుకొచ్చినా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లో కామన్గా ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే.. ఈసారి ఓ సెలబ్రిటీ భారీగా అక్రమ బంగారంతో పట్టుబడడం సంచలనంగా మారింది. ఫలితంగా దుబాయ్ నుంచి బంగారాన్ని ఎందుకు ఎక్కువగా తరలిస్తుంటారు..? అక్కడి నుంచి బంగారం తీసుకొస్తే ఎందుకు పట్టుకుంటారు? అసలు.. దుబాయ్ నుంచి లీగల్ గా ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? అనే అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వాస్తవానికి.. మన దేశంతో పోల్చితే దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. పైగా దుబాయిలో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి టాక్స్లు ఉండవు. మన దేశంలోని బంగారం ధరకు, దుబాయ్ నుంచి తెచ్చుకున్న బంగారం ధరకు సుమారు 7, 8వేల రూపాయల వరకు రేటు తేడా ఉంటుంది. అందుకే.. దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే.. అక్కడి నుంచి బంగారం తీసుకొచ్చేందుకు కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ రూల్స్ తప్పకుండా పాటించాలి. భారత్కు బంగారం తీసుకురావాలంటే ముందుగా దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం ఈ పన్ను 6 శాతం ఉండగా.. దీనిని కట్టకుండా ఎగ్గొట్టేందుకే దుబాయ్ నుంచి భారత్కు చాలామంది అక్రమంగా బంగారం తీసుకొస్తూ ఎయిర్పోర్టుల్లో పట్టుపడుతుంటారు.
Comments