రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Health tips: కిడ్నీల్లో రాళ్లకు.. ఇవే ప్రధాన కారణాలు తెలుసా..!

Kidney Stones Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle Health care news Health informati
Peoples Motivation

Health tips: కిడ్నీల్లో రాళ్లకు.. ఇవే ప్రధాన కారణాలు తెలుసా..!

• ఇటీవలి కాలంలో చాలా మందిలో కిడ్నీల్లో రాళ్ల సమస్య..

• మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తూ ఇబ్బందిపెడుతున్న తీరు..

• దీనికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయని చెబుతున్న శాస్త్రవేత్తలు..

Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle Health care news Health information news Telugu

చాలా మంది ఈ మధ్య కాలంలో కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తోంది. మారిన జీవన శైలి, మారిపోయిన ఆహార అలవాట్లు దీనికి కారణమని చాలా మంది భావిస్తుంటారు. అయితే దీనికి మరికొన్ని అంశాలు కూడా కారణం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మందులు వాడినా కూడా కొందరిలో తరచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయని వివరిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కారణాలను వివరిస్తున్నారు..

కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు..

హైపర్ థైరాయిడిజం, యూటీఐ, కొన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స చేయించుకుంటే లాభం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం..

కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చిన కొద్దీ మనకు ఏ మాత్రం శారీరక శ్రమ లేకుండానే చాలా వరకు పనులు పూర్తవుతున్నాయి. దీనికితోడు అధిక కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడమూ పెరిగింది. ఈ రెండింటి వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్య వస్తోంది. ఇది శరీరంలో మూత్రం పరిస్థితిని మార్చి కిడ్నీల్లో రాళ్లకు కారణం అవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

వంశపారంపర్యంగా, జన్యుపరంగా...

కొందరిలో వంశపారంపర్యంగా, జన్యుపరంగా కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మన ముందు తరాల్లో ఎవరెవరికి కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉందన్నది పరిశీలిస్తే... మనం ఎంత వరకు ఈ సమస్య బారినపడవచ్చన్నది గుర్తించి జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు.

అధికంగా ఉప్పు వాడకం...

ఆహారంలో అధికంగా ఉప్పు వాడటం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకున్నప్పుడు.. ఉప్పులోని సోడియం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే ఆహారం..

పాలకూర, నట్స్, చాకోలెట్ వంటివాటిలో ఆక్సలేట్లుగా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకున్నప్పుడు... కిడ్నీలలో క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా ఏర్పడటానికి అవకాశం ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

డీహైడ్రేషన్ ప్రభావం...

సరైన మోతాదులో నీళ్లు తాగకపోవడం వల్ల శరీరంలో మూత్రం గాఢత పెరుగుతుంది. దీనితో కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీటిని తీసుకుంటూ ఉంటే.. కిడ్నీల్లో రాళ్ల సమస్యకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.

అధిక కొవ్వులు ఉండే ఆహారం..

జంతు సంబంధిత కొవ్వులు, కొన్ని రకాల నూనెలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు బాగా పెరుగుతాయని, రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.


Comments

-Advertisement-