రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

PM INTERNSHIP PROGRAM: కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. నెలకు రూ.5000 స్టైఫండ్

PM Internship Program 2025 www.pminternship.mca.gov.in PM Internship eligibility PM Internship apply last date PM Internship details pminternship.mca
Peoples Motivation

PM INTERNSHIP PROGRAM: కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. నెలకు రూ.5000 స్టైఫండ్

PM Internship Program 2025 www.pminternship.mca.gov.in PM Internship eligibility PM Internship apply last date PM Internship details  pminternship.mca

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా విద్యార్థులకు సర్టిఫికేట్‌తో పాటు ఉపాధి, ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించాలని లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం-2025ను ప్రవేశపెట్టింది. పరిశ్రమ అనుభవాన్ని పొందాలనుకునే ఆసక్తి గల విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిస్తారు. బీఏ, బీఎస్సీ, బీకాం వంటి కోర్సులు చేసిన విద్యార్థులకు ఇతర వృత్తి విద్యా కోర్సుల మాదిరిగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సంప్రదాయ కోర్సుల విద్యార్థులకు అనుసంధానంగా పరిశ్రమలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వారికి పరిశ్రమల్లో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఆధార్‌ కార్డు లేదా పాస్‌పోర్టు, ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కార్డు, మార్కుల జాబితా, జనన, ఇతర సర్టిఫికెట్లు, తాజా పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, బయోడేటా అవసరం.


పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం-2025

దరఖాస్తులకు చివరి తేదీ మార్చి : 31

వెబ్‌సైట్‌ : www.pminternship.mca.gov.in

టోల్‌ఫ్రీ నంబరు: 1800116090

కేంద్ర ప్రభుత్వం ఒప్పందమైన కంపెనీలు : 500

తీసుకోగల ఇంటర్న్‌షిప్‌ల సంఖ్య : 5

స్టైపెండ్‌ నెలకు : రూ.5000

శిక్షణ కాలం : 12 నెలలు

జనరల్‌ వారికి వయసు : 21-24 ఏళ్లు

విద్యార్హత : పది, ఇంటర్‌/ఐటీఐ/12వ తరగతి, డిప్లొమా, యూజీసీ/ఏఐసీటీఈ గుర్తించిన వర్సిటీల డిగ్రీ

అనర్హులు : బీటెక్‌/ఎంబీఏ/సీఏ లాంటివి.

ఆర్థిక ప్రమాణం : కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు

Comments

-Advertisement-