రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Bhu Bharati: భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు భూభారతి

BHUBHARATHI PORTAL BHUBHARATHI PORTAL LAUNCH CM REVANTH REDDY BHUBHARATHI PORTAL 3 MANDALS Bhubharathi login Bhubharathi website Revenue bhubharathi
Peoples Motivation

Bhu Bharati: భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు భూభారతి

• భూభారతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

• పైలట్ ప్రాజెక్టు కోసం మూడు మండలాలను ఎంపిక చేసినట్లు వెల్లడి

• ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్న ముఖ్యమంత్రి

BHUBHARATHI PORTAL BHUBHARATHI PORTAL LAUNCH CM REVANTH REDDY BHUBHARATHI PORTAL 3 MANDALS Bhubharathi login Bhubharathi website Revenue bhubharathi

ఈ నెల 14వ తేదీ నుంచి భూభారతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వెబ్ సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్టీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్ కార్యదర్శి మకరంద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-