రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Auto Accident Road Accident Hit and RunThree Women Killed Satya Sai District Andhra Pradesh India Hindupur Hospital Dodagatta Village National Highway
Peoples Motivation

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

• సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

• కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం

• పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఘటన

Auto Accident Road Accident Hit and RunThree Women Killed Satya Sai District Andhra Pradesh India Hindupur Hospital Dodagatta Village National Highway

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మండలం ధనాపురం సమీపంలో ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొడికొండ సిరా 544 జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులను రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతిచెందిన మహిళలను అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సకమ్మా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిగి మండలం, ధనాపురం వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం, దొడగట్ట గ్రామానికి చెందిన అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సుంకమ్మ అనే ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హిందూపురం రూరల్ మండలం కోటిపి చౌడేశ్వరిదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా హిందూపురం-సిరా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Comments

-Advertisement-