రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇంటర్ లో ‘ఎంజేపీ’ ప్రభంజనం

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT
Peoples Motivation

ఇంటర్ లో ‘ఎంజేపీ’ ప్రభంజనం

* సెకండ్ ఇయర్ లో 98 శాతం

* ద్వితీయ సంవత్సర పరీక్షలకు 1,608 మంది విద్యార్థులు హాజరు..

* 1,578 మంది విద్యార్థులు ఉత్తీర్ణత

* ఫస్ట్ ఇయర్ 92.40 శాతం ఫలితాలు రాక

* మొదటి సంవత్సర పరీక్షలకు 1,925 మంది విద్యార్థులు హాజరు

* 1,779 మంది ఉత్తీర్ణత

* ఫస్ట్, సెకండియర్ కలిపి 2 కళాశాలల్లో 100 శాతం రిజల్ట్

* సెకండియర్ ఇయర్ లో 7 కళాశాల్లో వంద శాతం ఫలితాలు

* ఫస్ట్ ఇయర్ లో 2 కళాశాల్లో హండ్రెడ్ పర్సంటేజీ

* రాష్ట్ర స్థాయి సగటు ఫలితాలు కంటే ఎంజేపీ ఫలితాలే అత్యుత్తమం

* ప్రభుత్వ పరిధిలోని రెసిడెన్షియల్ కళాశాల్లోనూ ఎంజేపీదే అగ్రస్థానం

* ఫలితాలపై మంత్రి సవిత హర్షం

* అధ్యాపకులకు, విద్యార్థులకు మంత్రి అభినందనలు

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- ఇంటర్ మీడియట్ ఫలితాల్లో మహత్మా జ్యోతిరావు పూలే బీసీ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సెకండ్ ఇయర్ లో 98 శాతం, ఫస్ట్ ఇయర్ లో 92.40 శాతం మేర ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వ జూనియర్, ఇతర రెసిడెన్షియల్ కళాశాలల కంటే ఎంజేపీ విద్యార్థులు మెరుగైన ఫలితాలతో ముందంజలో నిలిచారు. రాష్ట్ర ఫలితాల కంటే ఎంజేపీ స్కూళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం. శనివారం ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసిన చేసిన విషయం విధితమే. ఈ ఫలితాల్లో ఎంజేపీ బీసీ కళాశాలలు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ రిజల్ట్స్ సాధించాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 18 ఎంజేపీ కళాశాలలకు విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 1,608 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 1,578 మంది ఉత్తీర్ణులయ్యారు. 30 మంది మాత్రమే ఫెయిలయ్యారు. ఇంటర్ సెకండియర్ లో ఉత్తీర్ణత శాతం 98 శాతంగా నమోదయ్యింది. సెకండ్ ఇయర్ ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను బి. దివాకర్ అనే విద్యార్థి 984 మార్కులు, బైపీసీలో కె.కవితాభాయి 982 మార్కులు సాధించారు. మొదటి సంవత్సర పరీక్షలకు 1,925 మంది హాజరుకాగా, వారిలో 1,779 మంది ఉత్తీర్ణులయ్యారు. 146 మంది ఫెయిల్ కాగా, మొదటి సంవత్సర పరీక్షల్లో 92.40 శాతం మేర ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు గానూ ఎం.మనోజ్ కు 463 మార్కులు రాగా, బైసీపీలో 440 మార్కులకు జి.మేఘన, జి.దస్తగిరి, సీహెచ్ రాణి 435 మార్కులు సాధించారు.

2 కళాశాలల్లో 100 శాతం రిజల్ట్

ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి రెండు ఎంజేపీ బీసీ జూనియర్ కళాశాలు వంద శాతం ఫలితాలు రాబట్టాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గుడిబండ (బాలికలు), తిరుపతి జిల్లా కోట(బాలురు) ఎంజేపీ కళాశాలలకు చెందిన విద్యార్థులంతా ఫస్ట్, సెకండ్ ఇంటర్ లో వంద శాతం మేర ఉత్తీర్ణులయ్యారు. 

ఇంటర్ సెకండ్ లో 7 కళాశాలలో వంద శాతం రిజల్ట్

ఇంటర్ సెకండ్ ఇయర్ లో 18 కళాశాలలకు గాను 7 కళాశాలల్లో వంద శాతం మేర ఫలితాలు వచ్చాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరైన కోట(బాలురు), గుడిబండ(బాలికలు), బేతమచర్ల(బాలురు), నెరవాడ(బాలికలు), సోడం(బాలురు), దొరవారిసత్రం(బాలురు), నెల్లిమర్ల(బాలికలు)కు చెందిన ఎంజేపీ జూనియర్ కళాశాలల విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు.

ఫస్ట్ ఇంటర్ లో 2 కళాశాలల్లో వంద శాతం ఫలితాలు

ఫస్ట్ ఇంటర్ లో రెండు ఎంజేపీ కళాశాల విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గుడిబండ (బాలికలు), తిరుపతి జిల్లా కోట(బాలురు) విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు.

రాష్ట్ర సగటు ఫలితాలు కంటే అత్యుత్తమం

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ కళాశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. రాష్ట్ర స్థాయి సగటు ఫలితాలు పరిశీలిస్తే... ఫస్ట్ ఇంటర్ లో 70 శాతం ఫలితాలు రాగా, ఎంజేపీ కళాశాలు 92.40 శాతం మేర ఫలితాలు సాధించాయి. ఇంటర్ సెకండియర్ లో రాష్ట్ర వ్యాప్తంగా 83 శాతం మేర ఫలితాలు రాగా, ఎంజేపీ కళాశాల విద్యార్థులు 98 శాతం మేర ఉత్తీర్ణత సాధించడం విశేషం. 

ఎంజేపీ బీసీ విద్యార్థుల సత్తా...

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏపీఆర్జీసీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలు పరిశీలిస్తే...ఎంజేపీ బీసీ కళాశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. సెకండ్ ఇంటర్ లో ఎంజేపీ బీసీ కళాశాలలు 98 శాతం మేర ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్జేసీ 96 శాతం, సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ కళాశాలు 94 శాతంతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఏపీ ట్రైబల్ ఫెల్ఫేర్ రెసిడెన్షియల్ 91 శాతం, కేజీబీవీలు 84 శాతం, మోడల్ స్కూళ్లు 82 శాతం, ప్రభుత్వ కళాశాలలు 69 శాతంతో తరువాత స్థానాల్లో నిలిచాయి. 

మంత్రి సవిత అభినందనలు

ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ బీసీ కళాశాలు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఎంజేపీ బీసీ కళాశాలు ఫలితాలు సాధించాయన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గుడిబండ (బాలికలు), తిరుపతి జిల్లా కోట(బాలురు) ఎంజేపీ కళాశాలు వంద శాతం ఫలితాలు సాధించాయన్నారు. ఇంటర్ సెకండియర్ లో 7 కళాశాలలు, ఫస్ట్ ఇయర్ లో 2 కళాశాలల విద్యార్థులు వంద శాతం మేర ఉత్తీర్ణత సాధించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తోందని, సీఎం చంద్రబాబు ఆశయాలు నెరవేర్చేలా ఇంటర్ లో ఫలితాలు రాబట్టినందుకు ఆమె ఆనందం వ్యక్తంచేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో విశేష కృషి చేసిన ఎంజేపీ బీసీ అధ్యాపకులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, విద్యార్థులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు.

Comments

-Advertisement-