విపత్తు సమయాల్లో ఫైర్ సిబ్బంది సేవలు అమోఘం
విపత్తు సమయాల్లో ఫైర్ సిబ్బంది సేవలు అమోఘం
• ట్రెండ్ సెట్ మాల్ లో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహణ
• ఫైర్ విభాగంలో అవసరమైన కొత్త వాహనాలు కొనుగోలు చేశాం
• కొత్త టెక్నాలజీ ద్వారా ఫైర్ ప్రమాదాలు నివారణకు చర్యలు
- వంగలపూడి అనిత, హోమ్ శాఖ మంత్రి
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్ లో శుక్రవారం మాకు డ్రిల్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు. అందులో భాగంగా మాల్స్ లో అనుకోని రీతిలో అగ్ని ప్రమాదాలు సంబవిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించటం జరిగిందన్నారు. అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించటానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతుంటాయన్నారు. ఇందుకు కారణం 1944 ఏప్రిల్ 14 న ముంబాయి ఓడరేవులో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అందులో 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవటం, 87 మంది సిబ్బంది గాయాలపాలవటం జరిగిందన్నారు. అమరవీరుల జ్ఞాపకార్ధంగా ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నారన్నారు. వారం రోజులపాటు అగ్ని ప్రమాదాలపై వివిధ కార్యక్రమాలు ఫైర్ సిబ్బంది నిర్వహిస్తున్నారన్నారు. 2025 కి అగ్ని సురక్షిత భారతదేశం తయారు కావాలనే ముఖ్య సందేశంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
అగ్ని మాపక సిబ్బంది సేవలు ఎనలేనివని, ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందు వరుసలో ఉంటూ ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడతారన్నారు. విజయవాడ వరద సమయంలో 2 వేల ఇళ్లను ఫైర్ సిబ్బంది 150 ఫైర్ ఇంజన్లతో ఇళ్లను, రోడ్లను శుబ్రం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫైర్ విభాగం ఆధునికీకరణకు రూ. 250 కోట్లు కేటాయించామన్నారు. మాల్స్ సహా ఎత్తైన ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అధునాతన వాహనాలు కొనుగోలు చేశామన్నారు.. జపాన్ నుంచి 3 వాహనాలు కొనుగోలు చేశామన్నారు. అందులో విజయవాడలో రూ. 10 కోట్ల తో అధునాతన టర్న్ టేబుల్ వ్యాన్, వైజాగ్ లో రూ. 20 కోట్లతో ఒక వాహనం, అదేవిధంగా తిరుపతిలో ఒక వాహనం కొనుగోలు చేశామన్నారు. ఈ వాహనాలు 55 మీటర్ల ఎత్తు వరకు తమ సేవలను అందించనున్నాయన్నారు. ఫైర్ విభాగంలో అవసరమైన 190 కొత్త వాహనాలు కొనుగోలు చేశామన్నారు. టెక్నాలజీ వినియోగించి ఫైర్ ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫైర్ విభాగంలో సిబ్బంది కొరత ను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫైర్ స్టేషన్స్ లేని చోట కొత్త వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. మాక్ డ్రిల్ లో భాగంగా ప్రదర్శించిన సిలిండర్ ఫైర్ డెమో బాగా చూపించారన్నారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలో జరిగిన బాణా సంచా పేలుడులో ఫైర్ సిబ్బంది సేవలు అనిర్వచనీయమన్నారు. రాష్ట్రంలో పెద్ద నగరాల్లో అగ్ని ప్రమాదాలపై సేప్టీ ప్రికాషనరీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ పానిక్ అవుతారన్నారు. అలా పానిక్ కాకుండా గ్యాస్ ప్రమాదం జరిగితే ఎలా నియంత్రించాలో చాలా బాగా డెమో చేసి ఫైర్ సిబ్బంది చూపించారన్నారు. విజయవాడ వరద ప్రమాద ప్రాంతాల్లో అగ్ని మాపక సిబ్బంది బాగా చేవలు అందించారన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సంచాలకులు మురళీ మోహన్, అడిషనల్ డైరెక్టర్లు జి. శ్రీనివాసులు, టి. ఉదయ్ కుమార్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఈ. స్వామి తదితరలు పాల్గొన్నారు.
మాక్ డ్రిల్: ట్రెండ్ సెట్ మాల్ లో నిర్వహించిన మాక్ డ్రిల్ లో స్థానిక సిబ్బందితోపాటు చాలామంది ప్రజల్లో అవగాహన కల్పించింది. ముఖ్యంగా వారు ప్రదర్శించిన గ్యాస్ ఫైర్ పై ముఖ్యంగా మహిళలు పానిక్ కాకుండా తడిబట్టను గ్యాస్ బండపై వేసి ఫైర్ ను ఆపడం స్థానిక సిబ్బందితో చేయించారు. ఇది పలువుర్ని ఆకట్టుకుంది. మాల్స్ లో ఫైర్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు బాగా ప్రదర్శించారు. జపాన్ నుంచి కొనుగోలు చేసిన అధునాతన టర్న్ టేబుల్ వాహనం 55 మీటర్ల ఎత్తైన మాల్స్ లో అందించే సేవలు ప్రదర్శించారు. ఇంకా పలు ఫైర్ సేఫ్టీ విధానాలను ప్రదర్శించి ఫైర్ ను కంట్రోల్ చేసే విధానాలు ఫైర్ సిబ్బంది ప్రదర్శించారు.