గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ముమ్మర ప్రచారం
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ముమ్మర ప్రచారం
డీఎం హెచ్ ఓ డాక్టర్ ఈబీ దేవి
అనంతపురం
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నందు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం మీద జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి అధ్యక్షతన జరిగింది .
ఈ కార్యక్రమంలో డా.ఈ. బి .దేవి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రసార మాధ్యమాలు అయినటువంటి సినిమా థియేటర్స్ మరియు ఆకాశవాణి రేడియో దినసరి కార్యక్రమ ప్రసారాల్లో ఆయా కార్యక్రమాల విరామం మధ్యలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై తయారు చేయబడిన వీడియో మరియు ఆడియో క్లిప్పింగులను ప్రసారం చేసి ఆడపిల్లల విలువ ప్రజలకు తెలిపి తద్వారా జిల్లాలో లింగ నిష్పత్తిని మరియు ఆడపిల్లల పుట్టుకను పెంచే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని కమిటీ సభ్యుల సమక్షంలో వివరించారు
అదేవిధంగా జిల్లాలో అన్ని పబ్లిక్ ప్రదేశాలలో రేడ్స్ స్వచ్ఛంద సమస్థ ద్వారా ఆడపిల్లల ప్రాముఖ్యత పైన వాల్ రైటింగ్స్ రాయడం జరుగుతున్నదని అలాగే జిల్లా లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు వారి సమక్షంలో ప్రజలందరికీ మండల కేంద్రం పరిధిలో మరియు క్షేత్రస్థయి సిబ్బంది ద్వారా ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలిపేలా కార్యక్రమాలు చేపట్టి ఆయా వివరాలను జిల్లా కార్యాలయానికి సకాలంలో పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కమిటీ సభ్యులు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై తమ తమ విలువైన అభిప్రాయాలను సమావేశం నందు చర్చించి తగు సూచనలు అందించారు .
ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ యుగంధర్, ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవి శంకర్, చిన్నపిల్లల నిపుణులు డా రవి కుమార్ , స్త్రీ వ్యాధి నిపుణులు డా, రేణుక ప్యాథలజిస్ట్ డా శ్రావణి ,ఆర్ డి టి సమస్థ డా దుర్గేశ్ ,డి పి ఆర్ ఓ. గురుస్వామి, ఐసీపీయస్ చంద్రకళ ,డెమో త్యాగరాజు, గంగాధర్ , వెంకటేష్, విజయ్ ,కిరణ్, లీగల్ అడ్వైజర్ ఆషారాణి , శ్రీకాంత్ పాల్గొన్నారు .