రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

INTER RESULTS: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఆరోజే

tgbie.cgg.gov.in INTER RESULTS DEPUTY CM BHATTI VIKRAMARKA INTER RESULTS ON APRIL 22ND TELANGANA INTER RESULTS UPDATE TELANGANA INTER RESULTS TG INTER
Peoples Motivation

INTER RESULTS: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఆరోజే 

• ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు. 

• డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను వెల్లడిస్తారని ప్రకటన..

tgbie.cgg.gov.in INTER RESULTS DEPUTY CM BHATTI VIKRAMARKA INTER RESULTS ON APRIL 22ND TELANGANA INTER RESULTS UPDATE TELANGANA INTER RESULTS TG INTER

తెలంగాణలో ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారని విద్యాశాఖ తెలిపింది. గత నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం, పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మూల్యాంకనంలో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక, ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వేరిఫై చేయడం జరుగుతుంది. అలాగే, అధికారులు ఎలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారం రోజుల్లో పూర్తి చేయాలని తెలుస్తోంది. తెలంగాణ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది.

ప్రతిసారి ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తరువాత, రీ వాల్యుయేషన్‌కు అవకాశం ఉంటుంది. దీని కోసం ప్రతి సబ్జెక్టుకు 600 రూపాయలు వసూలు చేయబడతాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://tgbie.cgg.gov.in లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వాట్సప్ ద్వారా కూడా ఫలితాలను పొందడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Comments

-Advertisement-