PMJAY: 70 ఏళ్లు ఆపైన వున్న వారందరికి పీఎంజేఏవై
PMJAY: 70 ఏళ్లు ఆపైన వున్న వారందరికి పీఎంజేఏవై
70 ఏళ్ల దాటిన వయో వృద్ధుల వారికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన 'పీఎంజేఏవై వయో వందన' (ఆరోగ్య బీమా) సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు ఆపైన వున్న వారందరికి వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఒ.యం.యస్.నెం. 49, తేది: 02.04.2025 ద్వారా పీఎంజేఏవై వయో వందన' (ఆరోగ్య బీమా) అమలు పరుచుటకు ఉత్తర్వులు జారీ చేసింది..
పీఎంజేఏవై వయోవందన' (ఆరోగ్య బీమా) అమలైతే దారిద్ర్యరేఖకు ఎగువనున్న వారు రూ.5 లక్షల మేర ఉచిత బీమా పొందే అవకాశం ఉంది. మరో వైపు దారిద్య్రరేఖకు దిగువన వున్న 70 ఏళ్ల వయస్సున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా రూ. 5 లక్షల మేర ఉచిత బీమా వర్తింస్తుంది.
పీఎంజేఏవై వయో వందన'(ఆరోగ్య బీమా) రిజిస్ట్రేషన్ కొరకు మోబైల్ ఫోన్ అప్లికేషన్(ఆయుష్మాన్ ఆప్) లేదా వెబ్సైట్ పోర్టల్ beneficiary.nha.gov.in ద్వారా ధరఖాస్తు చేసుకొనవచ్చును. అయుష్మాన్ కార్డ్ల జారీకి ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరి.
కావున జిల్లాలోని 70 ఏళ్లు ఆపైన వున్న వయో వృధ్ధులుకేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంజేఏవై వయో వందన' (ఆరోగ్య బీమా) పథకాన్ని సద్వినియోగం చేసుకొవవలసినదిగా తెలియచేయడమైనది.
గమనిక: వన్ టైం ఆప్షన్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీమా పధకంలో సభ్యులుగా ఉన్న వారు అందులోనే కొనసాగుతారా? పీఎంజేఏవై పరిధిలోనికి వస్తారా? అన్న దానిపై నిర్ణయాన్ని తీసుకోవాలి. వన్ టైమ్ అప్షన్ ద్వారా ఈ పధకం క్రింద చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తారు.