రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TGRJC: పదో విద్యార్థులకు అలర్ట్.. సీటు వస్తే ఇంటర్‌లో అన్నీ ఫ్రీ

TSRJC CET TSRJC COLLEGES TSRJC Application tsrjc.cgg.gov.in 2025 TSRJC notification 2025 TSRJC apply online 2025 TSRJC HALL TICKETS TSRJC results 2025
Peoples Motivation

TGRJC: పదో విద్యార్థులకు అలర్ట్.. సీటు వస్తే ఇంటర్‌లో అన్నీ ఫ్రీ

• తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్..

• గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలు..

• టీజీఆర్‌జేసీ-2025 నోటిఫికేషన్ విడుదల..

TSRJC CET TSRJC COLLEGES TSRJC Application tsrjc.cgg.gov.in 2025 TSRJC notification 2025 TSRJC apply online 2025 TSRJC HALL TICKETS TSRJC results 2025

TGRJC: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 2025-2026 విద్య సంవత్సరానికి గాను ఇంటర్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి టీజీఆర్‌జేసీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు టీజీఆర్‌జేసీ సెట్‌కు అప్లై చేసుకోవచ్చు.

ఇక ఆర్‌జేసీసెట్ 2025 నోటిఫికేషన్ ప్రకారం.. మార్చి 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ గురుకుల కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులు.. ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి.. వారు పొందిన మార్కుల ప్రకారం ఆయా కాలేజీల్లో, కోర్సుల్లో సీటు కేటాయిస్తారు. గురుకుల కాలేజీల్లో చేరాలనుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. మరిన్ని వివరాలకు 040-24734899 నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చని సూచించింది.

అధికారిక వెబ్సైట్: http://tgrjc.cgg.gov.in/

Comments

-Advertisement-