రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మరో 2,260 అదనపు టీచర్ పోస్టులు.. హైకోర్టు లో 245 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఇలా.. నేటి ఈ-క్యాబినెట్ పూర్తి వివరాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation
మరో 2,260 అదనపు టీచర్ పోస్టులు.. హైకోర్టు లో 245 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఇలా.. నేటి ఈ-క్యాబినెట్ పూర్తి వివరాలు 

Ap e-cabinet nara Chandrababu Naidu pawan kalyan

మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో  పలు అంశాలపై రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు కొలుసు పార్థసారధి  మరియు రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  సంయుక్తంగా మీడియాకు వివరించారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మాట్లాడుతూ..

పరిశ్రమలు & వాణిజ్య శాఖ:

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB) మీటింగ్లో M/s. డెక్కన్ ఫైన్ కెమికల్స్, M/s. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, M/s. PUR ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, M/s. బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్, మరియు M/s. జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సిఫారసులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన, రోడ్లు, పారిశ్రామిక నీరు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భూములను కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల స్థాపనను వేగవంతం చేసేందుకు ఈ ఆమోదం దోహదపడుతుంది. అలాగే ఈ విధి విధానాల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు పొందేందుకు దోహదపడుతుంది.

ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.9,246 కోట్లు పెట్టుబడులకు అవకాశం కలగడమే కాకుండా దాదాపు 7,766 మందికి ఉద్యోగ అవకాశలు కలుగనున్నాయి. M/s. డెక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవసాయ రసాయనాలు, ఫైన్ & ప్రత్యేక రసాయనాల తయారీలో రూ.1,560 కోట్ల పెట్టుబడితో 1,800 ఉద్యోగాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ వ్యవస్థల ఏకీకరణ సముదాయంలో రూ.1,400 కోట్ల పెట్టుబడితో 800 ఉద్యోగాలు, PUR ఎనర్జీ విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంలో రూ.1,286 కోట్ల పెట్టుబడితో 1,200 ఉద్యోగాలు, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ APIs/మధ్యవర్తుల తయారీలో రూ.2,300 కోట్ల పెట్టుబడితో 1,750 ఉద్యోగాలు మరియు జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీలో రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 ఉద్యోగాలు కల్పిస్తాయి.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ:

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB)  తే.15.05.2025 దీన నిర్వహించిన సమవేశంలో పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను M/s. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ మరియు M/s. ATC టైర్స్ AP ప్రైవేట్ లిమిటెడ్ కు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయాలకు సంబందించిన ప్రతిపాదనలను  రాష్ట్ర మంత్రి ఆమోదం తెల్పింది.  ఈ ప్రతిపాదనల వలన సంబందిత పాలసీలకు అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను  వీరు పొందే వీలు కలుగుతుంది.

ఈ  రెండు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.2,261 కోట్లు పెట్టుబడులకు అవకాశం కలగడమే కాకుండా దాదాపు 2,125 మందికి ఉద్యోగ అవకాశలు కలుగనున్నాయి. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ సమగ్ర టెక్స్టైల్ ప్రాజెక్ట్కు రూ.482 కోట్ల పెట్టుబడితో 1,525 ఉద్యోగాలు మరియు ATC టైర్స్ AP ప్రైవేట్ లిమిటెడ్ టైర్ల తయారీలో రూ.1,779 కోట్ల పెట్టుబడితో 600 ఉద్యోగాలు కల్పిస్తాయి.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB)  తే.15.05.2025 దీన నిర్వహించిన సమవేశంలో పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని M/s. రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (RIPL) కు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయాలకు సంబందించిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి ఆమోదం తెల్పింది.  ఈ ప్రతిపాదనల వలన సంబందిత పాలసీలకు అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను  వీరు పొందే వీలు కలుగుతుంది.

ఈ ప్రాజెక్టు రూ.228 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తి (నేత) రంగంలో దీనిని నెలకొల్పనుంది.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB)  తే.15.05.2025 దీన నిర్వహించిన సమవేశంలో M/s విండ్టెక్ మొబైల్ మరియు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ALEAP ఇండియా) పెట్టుబడులకు సంబందించి ప్రాజెక్టు పనులను వేగవంతంగా ప్రారంభించేందుకు కావలసిన భూముల కేటాయింపు మరియు మౌలికవసతులైన ఇంధన, రహదారులు, నీరు, తదతర సౌకర్యాలను పొందే విధంగా చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది.

ఈ ప్రాజెక్టులు మొత్తం రూ.1,066 కోట్ల పెట్టుబడితో 11,598 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి. విండ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ఫోన్ తయారీలో రూ.1,061 కోట్ల పెట్టుబడితో 10,098 ఉద్యోగాలు మరియు ALEAP కుప్పం పారిశ్రామిక పార్కులో  రూ.5 కోట్ల పెట్టుబడితో 1,500 ఉద్యోగాలు కల్పిస్తాయి.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ

ఆంధ్రప్రదేశ్ లెదర్ & ఫుట్వేర్ పాలసీ (4.0) - 2024-30 ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ

భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై M/s GVIAL 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం  అంగీకారం తెలుపుతూ చేసిన సిఫారసులకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ

విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో తాజ్ గేట్వే పున:అభివృద్ధి కోసం 5-స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్గా మార్చేందుకు M/s వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నానికి ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB) తీసుకున్న నిర్ణయాలపై  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు రూ.899 కోట్ల పెట్టుబడితో 1,300 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో 5-స్టార్ హోటల్ & IT స్పేస్ను నిర్మించనుంది.

యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ

తిరుపతిలో IBIS స్టైల్స్ 3-స్టార్ మరియు నోవోటెల్ 5-స్టార్ క్లస్టర్ హోటల్ అభివృద్ధి కోసం M/s శ్రవంతి హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు వారికి ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB) తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు రూ.327 కోట్ల పెట్టుబడితో 570 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. శ్రవంతి హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో 3-స్టార్ & 5-స్టార్ హోటల్ క్లస్టర్ను నిర్మించనుంది.

యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ

తిరుపతిలోని S.V. పురం వడమలపేట వద్ద 5-స్టార్ రిసార్ట్ల అభివృద్ధి కోసం M/s బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ LLP, ఒడిశా వారికి భూమి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  (SIPB) తీసుకున్న నిర్ణయాల ప్రతిపాదనపై  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు రూ.150 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ LLP తిరుపతిలో 5-స్టార్ రిసార్ట్ను నిర్మించనుంది.

ఇంధన శాఖ:

ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో M/s. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ వారు 20 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన అభ్యర్థనపై ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు   రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు రూ.150 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏలూరులో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది.

ఇంధన శాఖ:

వైఎస్ఆర్ జిల్లాలోని గంగదేవిపల్లి మరియు నల్లబల్లి ప్రాంతాల్లో 260 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ కెపాసిటీని M/s. అంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలకు బదిలీ చేయడానికి M/s. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు రూ.3,941 కోట్ల పెట్టుబడితో 260 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఎంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ను నెలకొల్పనుంది.

ఇంధన శాఖ

అనంతపురం మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో M/s బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ 2000 మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు  చేసిన అభ్యర్థన పై ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ఈ ప్రాజెక్టు రూ.9,000 కోట్ల పెట్టుబడితో 3,900 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురము & శ్రీ సత్య సాయి జిల్లాలలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ను నెలకొల్పనుంది.

ఇంధన శాఖ

అనంతపురం మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లోని రాళ్ల అనంతపురం మరియు కురుబరహల్లి ప్రాంతాల్లో M/s. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 300.30 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ను M/s. దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడానికి  చేసిన అభ్యర్థనపై ఇంధన చేసిన ప్రతిపాదనకు రాష్జ్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ఈ ప్రాజెక్టు రూ.2,920 కోట్ల పెట్టుబడితో 230 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురము & శ్రీ సత్య సాయి జిల్లాలలో విండ్ పవర్ జనరేషన్ ప్రాజెక్టును నెలకొల్పనుంది.

ఉన్నత విద్యా శాఖ

"ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అట్ ఆంధ్ర ప్రదేశ్ ఆర్డినెన్స్, 2025" ప్రకారము ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER) సంస్థను  బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా  రాష్ట్ర రాజధాని  అమరావతిలో ఏర్పాటు చేసేందుకై చేసిన ఆధీకృత నిర్ణయ ఆమోదానికై ఉన్నత విద్యా శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ఈ విశ్వవిద్యాలయం వలన అధిక-నాణ్యత గల న్యాయ విద్య మరియు పరిశోధనలను అందించే విధంగా ఉంటుంది. 

అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER) యొక్క ప్రధాన లక్ష్యం (i) వృత్తిపరమైన చట్టపరమైన మనస్తత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి చట్టం, చట్టపరమైన ప్రక్రియలు మరియు సంబంధిత విభాగాల అభ్యాసం మరియు జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మరియు వ్యాప్తి చేయడం; (ii) న్యాయవాదం, న్యాయ సేవలు, చట్టం, చట్ట సంస్కరణలు వంటి ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా న్యాయ వృత్తి ద్వారా సమాజానికి సేవ చేయడానికి విద్యార్థి మరియు పరిశోధనా పండితుడిలో బాధ్యత మరియు నిబద్ధతను పెంపొందించడం, నైతికత మరియు అభ్యాసాలపై తగిన ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఉపయోగ పడుతుంది.

దీని వలన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 20% సీట్ల కేటాయింపు ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER) ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నాణ్యమైన న్యాయ విద్యను అభ్యసించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల, ఆంధ్రప్రదేశ్లోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం మరియు ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ను న్యాయ కేంద్రంగా మారుస్తుంది.

ఉన్నత విద్యా శాఖ:

గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దుపరుస్తూ, డాక్టర్ B.R. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చట్టం, 1982 లోని సెక్షన్ 3 యొక్క సబ్-సెక్షన్ (4) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు సమీపంలో డాక్టర్ B.R. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా, ప్రభుత్వం ఉన్నత విద్య మరియు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను మరింత సమ్మిళితమైన మరియు జ్ఞానవంతమైన సమాజాన్ని పెంపొందించేందుకు  దోహదపడుతుంది.

ఈ చొరవతో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి రావడమే కాకుండా  విభిన్న వర్గాల అవసరాలను తీరుస్తుంది మరియు రాష్ట్రంలోని రాష్ట్ర లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో సులభంగా ప్రవేశం లేని విద్యార్థులను శక్తివంతం చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 అధ్యయన కేంద్రాలను నిర్వహించడానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థుల విస్తృత విద్యా ప్రయోజనాలకు సేవ చేయడానికి, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది.

ఉన్నత విద్యా శాఖ

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం, 1985 లోని సెక్షన్ 3(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికై నోటిఫికేషన్ జారీచేసేందుకు  రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం, 1985 (1985 చట్టం నం. 27) లోని సెక్షన్ 3(2) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయబడింది, తద్వారా ఈ విషయంలో గతంలో జారీ చేసిన ఆదేశాలను భర్తీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది.

ప్రధానంగా  తెలుగు భాష మరియు సాహిత్యం మరియు ఇతర లక్ష్యాలను అభ్యసించడానికి విద్యార్థుల అవసరాలను తీర్చడానికి APలో ఉన్న 3 కేంద్రాలను నిర్వహించడానికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం' అనే పేరు మరియు శీర్షికతో ఒక తెలుగు విశ్వవిద్యాలయం ఉండాలని AP రాష్ట్రం కోరుతోంది.

➤ తెలుగు భాషా సాహిత్యం మరియు సంస్కృతిలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా పని చేస్తుంది. 

➤ తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళ, సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం, శిల్పం, వాస్తుశిల్పం, పురావస్తు శాస్త్రం, భాష, సాహిత్యం, వ్యాకరణం, భాషాశాస్త్రం, చరిత్ర, మతం, తత్వశాస్త్రం, వైద్యం, ఇంజనీరింగ్ శాస్త్రాలు మరియు చేతిపనులు మరియు ఇలాంటి వాటిలో అధునాతన అధ్యయనం మరియు పరిశోధనలను సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. 

➤ భవిష్యత్తులో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనకు అవకాశం కల్పించడం; జరుగుతోంది.

పాఠశాల విద్యా శాఖ

W.P.(C) నెం. 132/2016 లో  భారత సర్వోన్నత  న్యాయ స్థానం జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 1136 SGTs మరియు 1124 పాఠశాల సహాయకుల పోస్టులు మొత్తం 2,260 ఖాళీగా ఉన్న అదనపు  పోస్టులుగా మార్చుతూ  తే.15.04.2025 దీన పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన G.O.Ms. నెం. 13 ను దృవీకరించేందుకు   చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యావకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల కోసం 2,260 కొత్త పోస్టుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  మేధోపరమైన వైకల్యాలు మరియు ప్రత్యేక అభ్యాస వైకల్యాలు వంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులకు తగిన విద్యాపరమైన మద్దతును అందించడమే దీని  లక్ష్యం. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడంలో మరియు విద్యా వ్యవస్థలో సమానత్వాన్ని ప్రోత్సహించడంలో ఇది కీలకమైన దశ.

రెవెన్యూ (రిజిస్ట్రేషన్ & స్టాంప్స్) శాఖ

ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం-1905 లోని 22-A నిషేదిత జాబితాలో ప్రభుత్వ/కేటాయించిన/ఎండోమెంట్స్/వక్ఫ్ భూముల చట్టవిరుద్ధ బదిలీని రద్దు చేయడం కోసం రిజిస్ట్రేషన్ చట్టం 1908 కింద  ఆంధ్రప్రదేశ్ నియమావళిలోని నిబంధన 26(k)(i) కింద సంబందిత అధికారుల ఆదేశం ప్రకారం రెవెన్యూ/ఇతర అధికారులు అమలు చేసే రద్దు డీడ్లపై రిజిస్ట్రేషన్ ఫీజు మరియు యూజర్ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడానికి   రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

రెవెన్యూ (భూములు) శాఖ

YSR జిల్లాలోని K.బొమ్మెపల్లి గ్రామంలో 1000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు GO Ms No.12 ప్రకారం  ఎకరానికి రూ.5,00,000/- చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.2,09,95,000/- లకు M/s అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ చేయడానికి   రాష్ట్ర రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

రెవెన్యూ (భూములు) శాఖ

శ్రీ సత్య సాయి జిల్లా పెద్దకొల్ల గ్రామంలో 500 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి GO Ms No.12 ప్రకారం  ఎకరానికి రూ.5,00,000/- చొప్పున 12.87 ఎకరాల   రూ.64,35,000/- ల చెల్లింపుపై  M/s. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ చేయడానికి రాష్ట్ర రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

రెవెన్యూ (భూములు) శాఖ

SPSR నెల్లూరు జిల్లా ముతుకు మండలం పైనాపురం గ్రామంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమిని APIIC కి ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

రెవెన్యూ (భూములు)

కర్నూలు జిల్లాలోని బి.తంద్రపాడు గ్రామంలో ESIC ఆసుపత్రి నిర్మాణం కోసం 5.00 ఎకరాల భూమిని ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)కి GO Ms No.296, Dt.24.12.2024 ప్రకారం కాకుండా గుంటూరు ESIC ఆసుపత్రి స్థాపనకై అనుసరించిన విదానాన్నే కర్నూలు జిల్లాలోని బి.తంద్రపాడు గ్రామంలో ESIC ఆసుపత్రి నిర్మాణం విషయంలో అనుసరించి 5.00 ఎకరాల భూమిని  ఉచితంగా ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కు కేటాయించాలని  రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపానకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

సాధారణ పరిపాలన (శాంతిభద్రతలు) శాఖ

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకర్గంలో తే.13.01.2022దీన రాజకీయ కారణంగా జరిగిన ఘర్షనల్లో మృతి చెందిన శ్రీ తోట చంద్రయ్య కుమారుడైన  శ్రీ తోట వీరాంజనేయులుకు  శాశ్వత ఉద్యోగం కల్పించేందుకై సంబంధిత నియమాలు/చట్ట నిబంధనలను సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

మృతుడి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉండటం మరియు దరఖాస్తుదారుడి తండ్రి మరణం తరువాత మృతుడి కుటుంబంలో సంపాదన లేని వ్యక్తి లేకపోవడంతో, గురాజాల RDO మరియు వెల్దుర్తి మండలం తహసీల్దార్ దరఖాస్తుదారుడు శ్రీ తోట వీరాంజనేయులు, S/o (లేట్) చంద్రయ్య, R/o గుండ్లపాడు గ్రామం అనే వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని మరియు మృతుడి భార్యకు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కూడా సిఫార్సు చేశారు.

రెవెన్యూ (భూములు) శాఖ

ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏర్పాటు చట్టం, 1974 లోని సెక్షన్ 3 యొక్క సబ్-సెక్షన్ (5) ప్రకారం చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పుంగనూరు, చౌడేపల్లి, సోమల మరియు సదుం మండలాలను మరియు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకై రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు & వాణిజ్య శాఖ

M/s. డైకిన్ ఎయిర్-కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి  తే.15.05.2025 దీన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం సిఫార్సుల ఆమోదానికై    పరిశ్రమలు, మౌలిక సదుపాయలు మరియు వాణిజ్య శాఖ  చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఈ కంపెనీ ఎయిర్ కండిషనింగ్ తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి ₹2,475 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ విస్తరణ వలన 5,150 మందికి ఉపాధి కల్పించబడుతుంది. డైకిన్ ఇప్పటికే శ్రీసిటీలో రూ. 1,604 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ప్రతిపాదిత విస్తరణతో, డైకిన్ ఇప్పుడు తన మొత్తం పెట్టుబడిని రూ. 4,079 కోట్లకు పెంచనుంది.

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు & వాణిజ్య శాఖ

M/s. సెన్సొరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి  తే.15.05.2025 దీన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం సిఫార్సుల ఆమోదానికై    పరిశ్రమలు, మౌలిక సదుపాయలు మరియు వాణిజ్య శాఖ  చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ఈ ప్రాజెక్ట్  622 నైపుణ్య ఉద్యోగాలను కల్పించనుంది మరియు రాష్ట్ర సెమీకండక్టర్ తయారీ రంగంలో అగ్రగామిగా అడుగులు ముందుకు వేసేందుకు దోహదపడుతుంది.

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు & వాణిజ్య శాఖ

క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు M/s IBM, M/s TCS మరియు M/s L&T మధ్య కుదుర్చుకున్న మూడు అవగాహన ఒప్పందాలను (MoUs) ధ్రువీకరించడానికి పరిశ్రమలు, మౌలిక సదుపాయలు మరియు వాణిజ్య శాఖ  చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

IBM, TCS మరియు L&T వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల మద్దతుతో, సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి  నాయకత్వం వహించనుంది. ఇటు వంటి ఆవిష్కరణలను ప్రోత్సహించి, ప్రపంచ ప్రతిభను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరియు దూరదృష్టి గల నాయకత్వం ద్వారా అత్యాధునిక ఆవిష్కరణలను పెంపొందించడానికి మరియు భవిష్యత్తుకు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది.

పరిశ్రమలు & వాణిజ్య శాఖ (గనులు)

పరిశ్రమలు మరియు వాణిజ్యం (గనుల) శాఖ జారీచేసిన ఈ క్రింద తెల్పిన వివిధ బాండ్లుకు సంబందించి ముఖ్య కార్యక్రమాల అమలుకై తీసుకోబడిన నిర్ణయాలను ఆమోదించేందుకై పరిశ్రమలు మరియు వాణిజ్యం (గనుల) శాఖ చేసిన ప్రతిపాదనలను  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

APMDC 2025-26' బాండ్ల కూపన్ రేటును 9.30% గా అంగీకరించడం మరియు దాని ఫలితంగా రూ.3,473.73 కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని, సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయడం 

G.O.Ms.No.69, Ind. & com (M-III), dt. 24.04.2025 ద్వారా APMDC కి 436 కొత్త స్వల్ప ఖనిజ ప్రాజెక్టులపై క్వారీ లీజ్హోల్డ్ హక్కులు మరియు మైనింగ్ హక్కుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం మరియు  త్రిపక్ష "గ్యారంటీ కమ్ అండర్టేకింగ్ పత్రాన్ని" అమలు చేయడం.

రవాణా & భవనాల శాఖ

రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేటును తగ్గించడానికి AP మోటార్ వెహికల్స్ ఆఫ్ గ్రీన్ ట్యాక్స్, 1963 లోని 5వ షెడ్యూల్లో సవరణ చేయడానికి రవాణా మరియు భవనాల  శాఖ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ బిల్లుకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 

న్యాయశాఖ (హోమ్-కోర్టులు)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో 245 పోస్టుల కల్పనకు న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

జిల్లా జడ్జి కేడర్లో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్. II), రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఎడిటర్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సెక్షన్ ఆఫీసర్లు, కోర్ట్ ఆఫీసర్లు, స్క్రూటినీ ఆఫీసర్లు మరియు అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్/ట్రాన్స్లేటర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, యుడి స్టెనో, అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కాపియర్ మెషిన్ ఆపరేటర్లు, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాజెక్ట్ లీడర్/ప్రాజెక్ట్ హెడ్ మరియు మాడ్యూల్ లీడర్లు/యూజర్ ఇంటర్ఫేస్(UI) వెబ్ డిజైనర్ల అదనపు పోస్టులకు అనుమతిని మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో రెండు నలభై ఐదు (245) పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.

రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ..

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాల శాఖ:

ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబందించి ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేస్తూ, గతంలో మాదిరిగానే చౌక ధర దుకాణాల ద్వారా నేరుగా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని పునరుద్ధరించేందుకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రేషన్ కార్డుదారులు ఇచ్చిన IVRS ఫీడ్బ్యాక్ ప్రకారం 25% మంది నిత్యావసర సరుకులు అందకపోవడం, 26% మంది MDU ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు చేశారు. అదనంగా, ప్రతి MDU మూడు FPS ప్రాంతాలను 15-17 రోజుల్లో మాత్రమే కవర్ చేయడం, వస్తువుల మళ్లింపు (288 కేసులు నమోదు), మరియు ఆపరేటర్ల కొరత (570 ఖాళీలు) వంటి సమస్యలు ఈ పథకం రద్దుకు కారణాలయ్యాయి. ఈ నిర్ణయం వలన ప్రభుత్వానికి రూ.353.81 కోట్లు ఆదా అవుతాయి.

గతంలో 29 వేల చౌఖ ధర దుఖాణాల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానం అమల్లో ఉండేది. గత ప్రభుత్వం ఈ విదానాన్ని స్వస్తి పలుకుతూ MDU వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేసే విదానాన్ని అమలు పర్చింది. ఇందుకై 9,260  MDU  వాహనాల కొనుగోలుకు రూ.1860 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. పైలెట్ ప్రాజెక్టుకోసం  మరో రూ.200 కోట్లను వెచ్చించడం జరిగింది. అయితే ఈ వాహనాల వల్ల వినియోగ దారులకు ఎటు వంటి ప్రయోజనం కలుగకపోవడమే కాకుండా రైస్ స్మగ్లింగ్ కు దారితీయడం జరిగింది. వ్యాను ఆపరేటర్లపై దాదాపు 200 కేసులు బుక్ చేయడం జరిగింది. రైస్ స్మగ్లింగ్ లో వీరు భాగస్వాములు అయ్యారు.  మూడు రోజుల్లోనే 93 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు చూపిస్తున్నారు. కానీ వినియెగ దారులకు సరుకులు సరిగా అందడం లేదు. ఒక్కొక్క వాహనానికి నెలకు రూ.27 వేల కార్పొరేషన్ నుండి చెల్లించండ జరుగుచున్నది. అయితే 570 వ్యాన్లపై ఇప్పటి వరకూ ఎటు వంటి సమచారం ఉండటం లేదు

వ్యానుల వల్ల  లబ్దిదారులు ఎందో ఇబ్బందులకు గురువుతున్నారు.రూ.385 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. చౌకధర  దుఖాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం వల్ల వినియోగదారులు ఎదో  టైమ్ లో సరుకులు తీసుకునేవారు, అటు వంటి సౌకర్యం వాహనాల వల్ల వినియోగదారులు కోల్పోవడం జరిగింది. కాబట్టి జూన్ 1 నుండి  చౌకధర  దుఖాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం మొదలు పెడతాం. 65 సంవత్సరాలు పైబడిన వృత్తులకు, దివ్యాంగులకు  డోర్ డెలివరీ చేస్తాము. రైస్ డైవర్షన్ ఈ విదానం వల్ల అగిపోతుంది.  చౌకధర దుఖాణాల ద్వారా ఇతర సరుకులు కూడా అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తాము.  ఎస్సీ,ఎస్టీ,బిసీ,ఇబిసి, తదితర కార్పొరేషన్ ల ద్వారా వాహనాలు పొందిన వారిలో ఎవరైతే  10 శాతం కట్టిన వారికి  ఈ వాహనాలను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. 

దీపం-2 పథకం క్రింద మొదటి ఫేజ్ లో దాదాపు 99,700 మంది లబ్దిపొందాయ ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది. దీపం-2 ఫేజ్  టూ అమల్లో బాగంగా ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ కోసమై బుక్ చేసుకోవడం జరిగింది.  ఫేజ్-3 లో ముందుగానే గ్యాస్ రాయితీ సొమ్మును  లబ్దిదారులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు  హిమాన్షు శుక్లా,  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ పాల్గొన్నారు.

Comments

-Advertisement-