మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.
పుట్టపర్తి మున్సిపాలిటీలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె,
సత్య సాయి జిల్లా పుట్టపర్తి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేందుకు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు వేయడం జరిగిందని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలియజేశారు. సందర్భంగా పుట్టపర్తి పట్టణంలోని గోపురం మెయిన్ రోడ్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందులో భాగంగానే పట్టణ కేంద్రంలో, ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కాలంలో 90 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి అయితే కుటుంబ పోషన జరగడానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో ఉదయం కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది. శిక్షణ పొందవచ్చన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం పుట్టపర్తి రూరల్ మరియు అర్బన్ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి, పెడబల్లి, గ్రామాలలో ఏర్పాటు చేసిన జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతర మహోత్సవంలో భాగంగా ఆయా గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సారథంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని. కూటమి ప్రభుత్వంపై ఉష వైసిపి ద్రుప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని. త్వరలోనే తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు రైతన్నలకు అన్నదాత సుఖీభవ హామీలను అమలు చేస్తామని. ఇది మహిళ సంక్షేమ ప్రభుత్వమని మహిళల అభ్యున్నతకు వారి పురోగతికి పాటుపడే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమేనని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తో పాటు ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ పావన్, రవి నాయక్, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ బెస్త చలపతి, పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, రూరల్ కన్వీనర్ విజయ్ కుమార్,టిడిపి నాయకులు శ్రీరామ్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, బొమ్మయ్య, మహేష్, శ్రీనివాసులు, ఉమాపతి, శ్రీరాములు, రాజప్ప,తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.