సూర్య ఘర్ తో విద్యుత్ బిల్లుల అదా
సూర్య ఘర్ తో విద్యుత్ బిల్లుల అదా
సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి, మే 20:
ప్రతి ఇంటి పైకప్పు పై ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ రూప్ టాప్ నిర్మించుకుంటే విద్యుత్ బిల్లులు బాగా తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు పుట్టపర్తి లోని సాయి ఆరామ్ లో మంగళవారం సత్యసాయిజిల్లా విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకంపై పుట్టపర్తి నియోజకవర్గం స్థాయిలో ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఎస్ ఈ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం వల్ల ప్రతి ఇంటిపై సోలార్ రూప్ టాప్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా విద్యుత్ బిల్లులు కూడా తగ్గించుకోవచ్చని సూచించారు. విద్యుత్ వినియోగం ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు కూడా తప్పనిసరి అయిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని విద్యుత్తు ఉత్పత్తి చేసుకుంటే అలాంటి వారికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఒక కిలో వాల్ ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు కు కలిపి ప్రస్తుతం మనకు వస్తున్న విద్యుత్ బిల్లు ₹1000 అయితే సోలార్ ఏర్పాటు చేసుకున్న తర్వాత 338 రూపాయలు బిల్లు మాత్రమే వస్తుందన్నారు. ఇలా 2 కిలో వాళ్లకు 240 యూనిట్లకు వచ్చే బిల్లు 2000 వస్తే సోలార్ ఏర్పాటు చేసుకున్న తర్వాత 333 బిల్లు మాత్రమే వస్తుందని తెలిపారు. మూడు కిలో వాల్ కు 360 యూనిట్లు అయితే వాటికి వచ్చే విద్యుత్ బిల్లు 2500 వస్తుందన్నారు సోలార్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అదే యూనిట్కు 293 బిల్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఏడాదికి మొత్తం ఆదా 120 యూనిట్లకు 8000 వరకు ,240 యూనిట్లకు 20,000 , 360 యూనిట్లకు 32,400 ఒక్కొక్క వినియోగానికి బిల్లు ఆదా అవుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కిలోవాల్ కు 120 యూనిట్లకు రూ.30,000 రెండు కిలోవాల్ కు 240 యూనిట్లకు రూ.50,000 3 కిలోవాల్ కు 360 యూనిట్లకు కలిపి రూ. 78 000 ప్రభుత్వ రాయితీ ఇస్తుందని వెల్లడించారు.
కరెంట్ వినియోగాన్ని ఆదా చేసినప్పుడే రాష్ట్ర ప్రగతి మరింత అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పైకప్పు పై సోలార్ గ్రూప్ టాప్ ఏర్పాటు తో విద్యుత్ ఉత్పత్తి చేసుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రెండు ఎకరాలలో సోలార్ గ్రూప్ టాప్ ఏర్పాటు చేయాలని అమలులో భాగంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బ్యాంకు వారు కూడా రుణాల అందజేస్తారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ సూర్యుడు ఇచ్చిన ఎనర్జీని మనం వాడుకోవాలని తెలిపారు, సోలార్ విద్యుత్ సక్రంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. దేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతల్లో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలు ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగం అధికం కావడం వల్ల రాష్ట్ర ఖజానాలో సగభాగం విద్యుత్తు అవసరాలకు నిధులు వెచ్చించాల్సి వస్తోందని వీటిని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం సోలార్ రూప్ టాప్ ఏర్పాటు తో విద్యుత్ ఉత్పత్తి పెంచుకొని ఇతరులకు వాటిని సరఫరా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చని సూచించారు. అనంతరం సోలార్ విద్యుత్ స్టాల్స్ ను ప్రముఖుల ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కదిరి డివిజనల్ ఇంజనీర్ మోసెస్, ఇతరసంబంధిత అధికారులు పాల్గొన్నారు.