రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మహిళల భద్రతకు శక్తి యాప్ పై అవగాహన

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మహిళల భద్రతకు శక్తి యాప్ పై అవగాహన 


ఆశ్రమ హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థులకు ఏలూరు పోలీసుల అవగాహన సదస్సు

ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన "శక్తి యాప్" పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం 28.05.2025 నాడు నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  ఎం. సుబ్బారావు ,శక్తి టీమ్ సభ్యులతో కలిసి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికల రక్షణకు ఉన్న చట్టాలు మరియు అత్యవసర సహాయ సంఖ్యలపై విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ముఖ్యంగా, విద్యార్థులకు క్రింది టోల్-ఫ్రీ నంబర్లు గురించి వివరించారు:

112 – అత్యవసర సేవల కోసం

1930 – సైబర్ మోసాల నివేదికల కోసం

1098 – బాలల హెల్ప్‌లైన్

181 – మహిళల హెల్ప్‌లైన్

1073 – ట్రాఫిక్ సమాచారం కోసం

101 – ఫైర్ ఎమర్జెన్సీ

ఇంకా, టోల్ ఫ్రీ నెంబర్ 79934 85111 మరియు జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ 9550351100 ను ఉపయోగించి ఎలా సహాయం పొందవచ్చో ప్రాక్టికల్ అవగాహననిచ్చారు.

ఇన్స్పెక్టర్  ఎం. సుబ్బారావు , “ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో అత్యవసర పరిస్థితులపై స్పందించే సామర్థ్యం పెంపొందించడమే మా లక్ష్యం,” అని తెలిపారు. అలాగే, ఈ విధమైన అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని విద్యాసంస్థల్లో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Comments

-Advertisement-