భారీ వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని, జిల్లా ఎస్పీ .వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు.
నీటి వనరుల పర్యవేక్షణ మరియు భద్రతా చర్యలు..
చెరువులు, కుంటలు, నదులు, కాలువలు మరియు ఇతర జలాశయాలను నిరంతరం పోలీసు అధికారులు పర్యవేక్షించాలన్నారు.
ప్రమాదకర స్థాయిలో నీరు ఉన్న ప్రదేశాలలో, లోతును సూచించే మరియు ప్రమాదం గురించి హెచ్చరించే బోర్డులను ఏర్పాటు చేయాలని. ఉదాహరణకు, "లోతుగా ఉంది, దయచేసి దూరంగా ఉండండి", "ఈత కొట్టడం నిషేధం", "పిల్లలు లోపలికి అనుమతించబడరు" వంటి సంకేతాలు ఉపయోగించాలన్నారు.
గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నీటి వనరుల దగ్గర పిల్లలు వెళ్లకుండా చూడాల్సిన ఆవశ్యకతను వివరించాలన్నారు.
నీటిలో దిగడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను నీటి వనరుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలని, ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు లేదా నీటిమట్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవసరమైతే, నీటి వనరుల దగ్గర నిఘా ఉంచడానికి స్థానిక యువకులను నియమించాలని. వీరు పిల్లలు లేదా ఇతరులు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా గమనిస్తూ ఉంటారని తెలిపారు.
నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్న ప్రాంతాలు, కట్టలు బలహీనంగా ఉన్న ప్రదేశాలు, మరియు చరిత్రలో వరదలు వచ్చిన ప్రాంతాలను గుర్తించాలన్నారు.
గ్రామంలోని ట్యాంకులు లేదా చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని. పూర్తి నీటిమట్టానికి చేరుకున్న ట్యాంకుల వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఏదైనా నీటి వనరు ప్రమాదకర స్థాయిలో ఉంటే లేదా వరదలు వచ్చే అవకాశం ఉంటే, వెంటనే స్థానిక పరిపాలనాధికారులకు, (మండల స్థాయి అధికారులు, పోలీసు రెవెన్యూ అధికారులు) సమాచారం ఇవ్వాలన్నారు.
వరదలు వచ్చే అవకాశం ఉంటే, గ్రామస్తులకు ముందస్తు హెచ్చరికలు అందించడానికి ఏర్పాట్లు చేయాలని (ఉదాహరణకు, మైకులు, మొబైల్ సందేశాలు) చెప్పారు.
ప్రజలను తరలించాల్సిన అవసరం ఏర్పడితే, సురక్షితమైన ఆశ్రయ కేంద్రాలను లేదా ఎత్తైన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలన్నారు.
వర్షాకాలంలో ప్రజల భద్రతకు సంబంధించి, అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికీ అప్పుడు సమాచారం ఇస్తూ ఉంటుందని. జిల్లా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉంటూ పోలీసులు జారీ చేసే సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఓ ప్రకటనలో తెలియజేశారు.