రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ
అమరావతి :
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన సాగించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నా విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఎస్పీ, డీఎస్పీలను సైతం ఇటీవల బదిలీలు చేసింది. అంతేకాదు గతేడాది రాష్ట్రంలోని పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీలో 9మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవోగా వి.కె శీనాయక్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల ఆర్డీవోగా జి.చిన్నయ్య నియామకమైనట్లు తెలుస్తోంది. కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేవీ రామలక్ష్మిని ప్రభుత్వం బదిలీ చేసింది. మిగిలిన వారికి ఆయా జిల్లాల్లో మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్లుగా, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.