నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
- నగరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.సి.ఎ.పి)పై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద పురోగతిలో ఉన్న పనులు వేగంగా చేపట్టాలన్నారు. నగరంలోని జిసిహెచ్ లో చేపడుతున్న మల్టీ లెవెల్ పార్కింగ్ ను పది రోజుల్లోపు పూర్తి చేయాలని, రాంనగర్ బ్రిడ్జి దగ్గర గ్రీనరీ అభివృద్ధి పనులు, ఇతర పనులను పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి నగర పాలక సంస్థ కమిషనర్ బాలరాజు, ఎస్ఈ చంద్రశేఖర్, డిటిసి వీర్రాజు, నగర పాలక సంస్థ ఈఈ షాకీర్ హుస్సేనీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్, తదితరులు పాల్గొన్నారు.