రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బాల్య వివాహాలు జరిగితే మీరే బాధ్యత వహించాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

బాల్య వివాహాలు జరిగితే మీరే బాధ్యత వహించాలి

కిశోరి వికాసంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకాంక్ష

అనంతపురం, మే 22 :

 జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగడానికి వీల్లేదని, ఒకవేళ ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో బాల్య వివాహాలపై కలెక్టర్ సమీక్షించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించే దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. బాల్యవివాహాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కిశోరి వికాసం సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ లో ఏప్రిల్ రెండో తేదీ నుండి జూన్ 10 వరకు జరిగ్ కార్యక్రమాలలో ఆర్థిక, పొదుపు అంశాలకు సంబంధించి డీ.ఆర్.డీ.ఏ పీడీ వెళ్లాలన్నారు. సైబర్ నేరాల గురించి దిశ డీఎస్పీ వెళ్లాలన్నారు. ఉన్నత విద్య గురించి డిస్టిక్ ఒకేషనల్ ఆఫీసర్ వెళ్ళాలని, బాలికల స్పోర్ట్స్ కు సంబంధించి డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెళ్ళాలన్నారు. కౌమార బాలికలకు సంబంధించిన విషయాలలో ఆర్డీటీ, ఎన్జీవోలు ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్లని అంగన్వాడి సెంటర్ కు వెళ్లి ఆ కార్యక్రమాల ఫొటోలను, ప్రోగ్రాం ఫీడ్బ్యాక్ తనకు తెలపాలన్నారు. కిశోరి వికాసం కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి పాల్గొని జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.

డిస్టిక్ లెవెల్ కోహఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ లో కూర్చున్న ప్రతి ఒక్క కమిటీ మెంబర్ నుండి బాల్యవివాహాలు నిర్మూలించడానికి కాంట్రిబ్యూషన్ కావాలని, వాటిని మీటింగ్ టు మీటింగ్ కచ్చితంగా నివేదిక రూపంలో తీసుకువచ్చి తర్వాత జరిగే కమిటీ సమావేశంలో వివరించాలన్నారు. పోలీస్ వారికి కూడా బైండోవర్స్ ఎన్ని అయ్యాయో తెలపాలన్నారు. చైల్డ్ మ్యారేజెస్ కు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ ఇన్ఫర్మేషన్, గత ఫిబ్రవరి నుంచి జరిగిన మ్యారేజెస్ లో బైండోవర్స్, ఎఫ్ఐఆర్ లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.

అనంతపురం జిల్లాలో 557 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వాటికి సంబంధించి ప్రతి గ్రామపంచాయతీలో బాల్యవివాహాల గురించి వాల్ రైటింగ్స్ రాయించాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్యను ఆదేశించారు. మైనార్టీ వెల్ఫేర్, ఏసీ ఎండోమెంట్స్, డిస్టిక్ రిజిస్టర్లు కూడా మ్యారేజ్ కి సంబంధించిన వారి దగ్గర ఉన్న డాటాను మీటింగ్ టు మీటింగ్ తప్పనిసరిగా అందించాలన్నారు.      జిల్లాలో ముస్లిం కమ్యూనిటీలో గుత్తి గుంటకల్ లో ఎక్కువ బాల్యవివాహాలు జరుగుతున్నాయని, వాటి గురించి ఐఈసీ యాక్టివిటీస్ చేయాలని ఆదేశించారు. ఇందులో మత పెద్దల్ని కూడా భాగస్వామ్యం చేయవలసిందిగా సూచించారు. ఐసీడీఎస్ పరిధిలో ఉన్న 11 ప్రాజెక్టుల సీడీపీఓలు తమ పరిధి లోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందర్నీ కలిసి చైల్డ్ మ్యారేజ్ గురించి చర్చించి వారి ఐడియాస్ తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా సూచించారు. తదుపరి సమావేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చైల్డ్ మ్యారేజెస్ గురించి అమలు చేస్తున్న కేస్ స్టడీస్ తీసుకుని ప్రజెంట్ చేయవలసిందిగా ఆదేశించారు.

 బాల్య వివాహాలు పర్యావసానాలు అంశంలో వ్యాసరచనలో గెలుపొందిన సలోమి, అనూష, వక్తృత్వపు పోటీలో అమ్రిన్ తైబా, సంధ్య, నస్రిన్ బేగం, పోస్టర్ల తయారీలో దివ్య, ప్రణవి, హర్ష గోవిందు, చిన్న వయసులో గర్భధారణ - పర్యావసనాలు అంశంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన ఎన్ సుదీప్తి, ఉషారాణి, కల్పన లకు, పోస్టర్ మేకింగ్ లో ఆర్ వెన్నెల,పి గౌస్ మొయిద్దీన్, ఎం .జైపాల్ ,వక్తృత్వపు పోటీలో గెలుపొందిన విభా కర్వ, శ్రీలత, సబ్స్టాన్స్ అబ్యూస్ అంశంలో వ్యాసరచనలో యామిని, పోస్టర్ మేకింగ్ లో మహిమా స్వరూప, ఎంపవరింగ్ ఇండియన్ యూత్, డ్రైవింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫార్ వికసిత్ భారత్ అంశంలో వక్తృత్వపు పోటీలో జె.దేవి దీక్షిత వ్యాసరచనలో షేక్ కుదుసియా తెహసీన, పోస్టర్ మేకింగ్ లో ఏ.హెచ్ .సాయి శ్రీనివాస్, వి. గురు ప్రకాష్, ఎస్ సుధా మాధవికి కలెక్టర్ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లను అందించి అభినందించారు.

 కార్యక్రమంలో డీ.ఆర్.డీ.ఏ పీడీ శైలజ, బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బూ కొఠారి, డేటాడబ్ల్యూఓ బోయ రామాంజనేయులు, డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఐసీపీఎస్ డిస్ట్రిక్ట్ చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ ఆఫీసర్(డీసీపీఓ) మంజునాథ్ పాల్గొన్నారు.

Comments

-Advertisement-