యోగాంధ్ర క్యాంపెయిన్ లో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
యోగాంధ్ర క్యాంపెయిన్ లో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
జిల్లా ప్రజలంతా యోగాని నిత్యం అభ్యసించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నిర్వహించిన యోగాంధ్ర- 2025 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, తదితరులు
యోగాంధ్ర క్యాంపెయిన్ లో రాష్ట్రంలో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం తాడిపత్రి పట్టణంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర యోగాంధ్ర- 2025లో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ అందరి చేత యోగాసనాలు వేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందులో భాగంగా తాడిపత్రి పట్టణంలోని పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు.మంచి ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరుస్ఫూర్తిగా తీసుకోవాలని, అందరూ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో అనంతపురం జిల్లాని అగ్రస్థానంలోనిలపాలని, నిరంతరం ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలను జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుత్తి కోట, తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం మరియు అనంతపురంలోని శిల్పారామంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.తాడిపత్రిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మాలోల, మున్సిపల్ వైస్ చైర్మన్స్ తలారి అరుణ, షేక్షావలి, ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్డిసి మల్లికార్జునుడు, డిఐపిఆర్ఓ పి.గురుస్వామిశెట్టి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా టూరిజం అధికారి జయ కుమార్ బాబు, డ్వామా పిడి సలీం భాష, ఎంపీడీవో ఫజిల్, ఈఓఆర్డీ వెంకటేష్, జనసేన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి, వివేకానంద యోగ సెంటర్ గురువు వై.ఆంజనేయులు, యోగ సెంటర్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, యోగ గురువు డాక్టర్ శ్రీనివాసులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.