రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Auto Driver: ఓ ఆటోవాలా నెలవారీ సంపాదన రూ. 8ల‌క్ష‌లు.. ఇంత‌కీ అత‌ను ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

Mumbai Auto Driver Ashok US Consulate Mumbai visa interview bag holding service entrepreneurship business idea monthly income Harsh Goenka viral story
Mounikadesk

Auto Driver: ఓ ఆటోవాలా నెలవారీ సంపాదన రూ. 8ల‌క్ష‌లు.. ఇంత‌కీ అత‌ను ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

• ముంబ‌యి ఆటో డ్రైవర్ అశోక్ వినూత్న వ్యాపార ఆలోచన..

• యూఎస్ కాన్సులేట్ బయట బ్యాగులు భద్రపరిచే సేవలు..

• ఒక్కో బ్యాగుకు రూ. 1000 వసూలు..

• నెలవారీ సంపాదన సుమారు రూ. 8 లక్షలు‌..

• ఆటోవాలా తెలివిని మెచ్చుకుంటూ హ‌ర్ష్ గోయెంకా ట్వీట్‌..

ముంబ‌యి మహానగరంలో అమెరికా వీసా కోసం కాన్సులేట్ వద్ద బారులు తీరే జనసందోహం మధ్య ఓ సాధారణ ఆటో డ్రైవర్ అసాధారణ రీతిలో నెలకు లక్షలు ఆర్జిస్తున్నాడు. ఎలాంటి సాంకేతిక యాప్ గానీ, పెద్ద చదువులైన ఎంబీఏ గానీ, స్టార్టప్ నిధులు గానీ లేకుండా కేవలం సమయస్ఫూర్తితో ఓ చిన్న సమస్యకు పరిష్కారం చూపిస్తూ నెలకు సుమారు రూ. 8 లక్షలు సంపాదిస్తున్నాడు. అశోక్ అనే ఈ ఆటో డ్రైవర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటోవాలా తెలివిని మెచ్చుకుంటూ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త హ‌ర్ష్ గోయెంకా ఈ విష‌య‌మై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

ముంబ‌యిలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద వీసా ఇంటర్వ్యూల కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని అశోక్ గమనించాడు. కాన్సులేట్ నిబంధనల ప్రకారం లోపలికి బ్యాగులు, సెల్‌ఫోన్లు తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అయితే, అక్కడ ఎలాంటి అధికారిక లాకర్లు లేదా వస్తువులు భద్రపరుచుకునే సౌకర్యం కూడా లేదు. దీంతో గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత, చివరి నిమిషంలో తమ వస్తువులను ఎక్కడ దాచుకోవాలో తెలియక వీసా దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. సరిగ్గా ఈ సమస్యనే అశోక్ అవకాశంగా మలుచుకున్నాడు.

సమీపంలో తన ఆటోను పార్క్ చేసుకుని, ఇబ్బంది పడుతున్న వారిని గమనిస్తూ "సార్, మీ బ్యాగ్ ఇవ్వండి. భద్రంగా ఉంచుతాను. వెయ్యి రూపాయలు ఛార్జ్ అవుతుంది" అంటూ వారికి తన సేవలను అందిస్తున్నాడు. అత్యవసరంలో ఉన్నవారికి అశోక్ మాటలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.

ఇలా ఈ 'బ్యాగ్ హోల్డింగ్' సర్వీస్ ద్వారా అశోక్‌కు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది కస్టమర్లు లభిస్తున్నారని సమాచారం. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 1,000 వసూలు చేయడం ద్వారా రోజుకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ లెక్కన నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నగరంలోని అనేక మంది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాల కంటే చాలా ఎక్కువ. దీనికోసం అతనికి ఎలాంటి మార్కెటింగ్ గానీ, వెబ్‌సైట్ గానీ అవసరం రాలేదు. కేవలం మౌత్ టాక్ ద్వారా అతని ఆటో కాన్సులేట్ వద్ద నిలిపి ఉండటం వల్ల ఈ వ్యాపారం విజయవంతంగా నడుస్తోంది.

Comments

-Advertisement-