శాలిహుండంలో యోగా వైభవం..
శాలిహుండంలో యోగా వైభవం..
బౌద్ధ క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం
– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శాలిహుండం (గార), జూన్ 7:
జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా యోగా ఉత్సవాలు ఊపందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం గార మండలంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం శాలిహుండంలో యోగాసనాల అభ్యాసన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ–
“ఈనెల 21న విశాఖలో మోదీ సారథ్యంలో ఐదు లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నాం. ప్రస్తుతం 150 దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారు,ఇది భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా ఉన్న ప్రాచీన ప్రక్రియ ,మోదీ కృషి వల్లే యోగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది,ప్రపంచ దేశాలకు యోగా ప్రాముఖ్యాన్ని తెలియజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అని తెలియజేశారు. ప్రతిరోజు యోగాసనాలు వేయటం దినచర్యలో భాగం
చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని,శాలిహుండం వంటి రెండవ శతాబ్దం కాలం నాటి బౌద్ధ క్షేత్రంలో ప్రశాంత వాతావరణంలో యోగా చేయడం మంచి అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ–
“గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. జిల్లాలో నాలుగు చారిత్రక ప్రదేశాలలో యోగ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని తల పెట్టామని ఇందులో భాగంగా ఇటీవల డచ్ బంగ్లాలో జరిగిన జిల్లా స్థాయి యోగా కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పుడు శాలిహుండంలో రెండవ కార్యక్రమాన్ని అదే స్థాయిలో నిర్వహించాం. త్వరలో కళింగపట్నం లో కూడా ఇంతే వైభవంగా చేస్తాం. జూన్ 21న విశాఖలో జరగనున్న ప్రధాని మోదీ కార్యక్రమాన్ని మనం కూడా విజయవంతం చేయాలి” అని వివరించారు.
స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ–
“ప్రస్తుత కాలంలో యువత చెడు మార్గాలవైపు ఆకర్షితమవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యోగా వారిని క్రమశిక్షణతో, ఆరోగ్యపరంగా మంచి మార్గంలో నడిపిస్తుంది. శాలిహుండం వంటి చారిత్రక ప్రదేశాల్లో ఇలాంటి ఆరోగ్యదాయక కార్యక్రమాలు జరగడం శుభపరిణామం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా.జగదీష్,డా.ఉత్తమ్ రాజ్ రాణా, వివిద యోగా సంస్థలు ల గురువులు తంగి స్వాతి,కొంక్యాణ మురళీ,యోగా గురువు మురళి, గాయత్రి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సురేంద్ర ,కల్పన, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలు ,యోగ శిక్షణ కేంద్రాల సభ్యులు,పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు.