యోగాసనాలు క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం మెరుగు.
యోగాసనాలు క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం మెరుగు.
జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ
యోగాసనాలు క్రమ పద్ధతిలో చేస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. శనివారం ఉదయం యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా అనంతపురం పట్టణం బళ్ళారి రోడ్డు ఎం వై ఆర్ కళ్యాణమండపంలో జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ యోగాసనాలు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నారు.
డిఎం అండ్ హెచ్ ఓ ఈబి దేవి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ హాస్పిటల్ వెళ్లే పని తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నకు తప్పకుండా హాజరు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. దైనందిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు 45 నిమిషాలు యోగా మెడిటేషన్ కు కేటాయించి యోగాసనాలు మెడిటేషన్ చేయడం వలన మిగిలిన టైం రోజంతా సంతోషంగా ప్రశాంతతతో ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, డి ఎం అండ్ హెచ్ ఓ డా. ఈబీదేవి, డిపిఓ నాగరాజు, డిఐపిఆర్ఓ పి. గురుస్వామి శెట్టి, ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ భాస్కర్, డాక్టర్ లాల్య నాయక్, ఈషా ఫౌండేషన్ స్వామీజీ దక్షరి, ఈషా ఫౌండేషన్ వాలంటీర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, యోగా గురువులు కృష్ణవేణి, గురు రాజారావు, అనంతపురం రూరల్ ఎంపీడీవో దివాకర్, పంచాయతీరాజ్ సిబ్బంది, సచివాలయాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.