రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన

  • ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ లను పరిశీలించిన మంత్రి టీం
  • మహారాష్ట్ర లోని పింప్రీ చించ్ వాడ లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సందర్శన
  • లక్నో లో ఘన వ్యర్థాల నిర్వహణ పరిశీలన
  • ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చడంలో భాగంగా పలు ప్రాంతాల సందర్శన

అమరావతి...

ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తుంది...ముఖ్యంగా పట్టణాలు,నగరాల్లో ప్రతి రోజూ వచ్చే ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణ ను సమర్థవంతంగా చేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తుంది..ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం,గుంటూరు లో ఉన్న చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ల ద్వారా ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు..త్వరలో మరో రెండు ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి...అయితే ఘన వ్యర్థాల నుంచి కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా కంపోస్ట్,ఇతర అవసరాలకు వినియోగించే పదార్థాలను కూడా తయారు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని భావిస్తుంది...దీనికోసం పలు ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను మంత్రి నారాయణ సందర్శిస్తున్నారు.

తాజాగా వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణ బృందం మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లో పర్యటించింది..సోమవారం సాయంత్రం పూణే చేరుకున్న మంత్రి నారాయణ బృందం....అక్కడి నుంచి పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వేస్ టూ ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించింది. అక్కడ ఘన వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఏ విధంగా అక్కడ అధికారులు మంత్రి నారాయణ బృందానికి వివరించారు.. ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటుగా స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు..

పింప్రి చించివాడ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లో ప్రతిరోజు కూడా 14 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.ఇదే ప్లాంట్ లో విద్యుత్ తో పాటు బయోగ్యాసును కూడా ఉత్పత్తి చేస్తున్నారు.. ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగంపై మున్సిపల్ మంత్రి నారాయణ కు అక్కడి కార్పొరేషన్ అధికారులు వివరించారు. 

ఇక బుధవారం మంత్రి బృందం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకుంది.లక్నో చేరుకున్న మంత్రి నారాయణ బృందానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా ఖరాక్వాల్, కమిషనర్ గౌరవ్ కుమార్ ఘనస్వాగతం పలికారు.. లక్నో వెళ్లిన మంత్రి బృందంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాసులు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ భాష కూడా ఉన్నారు. లక్నోలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను పలు రకాలుగా విభజిస్తూ స్థానిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు.. శివ్ ప్రాంతంలో ఉన్న ప్లాంట్ కు సంబంధించి ఘనవర్ధాలను ఏరకంగా ఉపయోగిస్తున్నామనే అంశాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి నారాయణ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లింది మంత్రి నారాయణ బృందం. క్షేత్రస్థాయిలో సందర్శించింది. అక్కడ ఘన వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ తో పాటు చెత్త నుంచి వచ్చే పౌడర్ ద్వారా ఇటుకులను కూడా తయారు చేస్తున్నారు... 

ఆ తర్వాత లక్నోలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కును మంత్రి నారాయణ బృందం సందర్శించింది..ఈ పార్కు లక్నో మున్సిపల్ కార్పొరేషన్ అద్భుతంగా నిర్మించింది..

Comments

-Advertisement-