మహిళల జోలికొస్తే ఖబడ్దార్
మహిళల జోలికొస్తే ఖబడ్దార్
- జగన్ , సజ్జల కుట్రలో భాగమే అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
- కుటిలయత్నాలు చేస్తే సహించం
- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో మహిళల నిరసన
- జగన్, సజ్జల, కృష్ణంరాజు కొమ్మినేని దిష్టిబొమ్మలతోపాటు సాక్షి ప్రతుల దగ్ధం
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దేవతలు నడియాడిన పుణ్యభూమి అమరావతి రాజధాని గురించి దెయ్యాలు మాట్లాడుతుంటే సహించబోమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ హెచ్చరించారు. అమరావతి రాజధాని మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు మంగళవారం స్థానిక హిమనీ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ సజ్జల కృష్ణంరాజు కొమ్మినేని దిష్టిబొమ్మలతో పాటు సాక్షి దినపత్రిక ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సాక్షి మీడియా ఛానళ్లను మూసివేయాలని నినదించారు. అమరావతి రాజధానిపై అనుషిత వ్యాఖ్యల వెనుక సజ్జల స్క్రిప్ట్ ఉందని ఎమ్మెల్యే నసీర్ మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతం అమరావతి అని చెప్పారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై నీచంగా మాట్లాడిన కొమ్మినేని కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం తీరును యావత్ రాష్ట్రం ఖండిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి,, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జగన్, సజ్జల అండ్ కో చేస్తున్న కుటిలయత్నాలను చూసి అందరూ ఛీ కొడుతున్నారన్నారు. సజ్జల మాట్లాడే తీరు దారుణంగా ఉందని, ఈ విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.