రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అవగాహన కొరకే ఓరియంటేషన్ ప్రోగ్రామ్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

అవగాహన కొరకే ఓరియంటేషన్ ప్రోగ్రామ్

తిరుమల లోజిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు

తిరుమలలో పనిచేయు టిటిడి, విజిలెన్స్ పోలీస్ ఇతర సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బంది అందరికీ ఆస్తానమండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడంజరిగింది.

1) ఇస్లామిక్ ఫండమెంటలిజం మరియు టెర్రరిజం కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.

2) వారు చేసిన దాడుల గురించి ముఖ్యముగా దేశంలో ప్రముఖ దేవాలయాలను టార్గెట్ గా నిర్వహించిన దాడుల గురించి వివరించడం జరిగింది.

3) వాటిని ఏ విధంగా అధిగమించి మన తిరుమల లో సెక్యూరిటీ విధానాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి వాటిని నిర్వహిస్తున్న వివిధ ఏజెన్సీలు ఏమిటి? వారి బాధ్యతలు ఏమిటి ?

5) మన తిరుమలలో ముఖ్య దేవాలయం తో పాటు ఇతర ఎస్టాబ్లిష్మెంట్ లు అనగా, అలిపిరి టోల్ గేట్ శ్రీవారి మెట్టు మరియు అలిపిరి నడకదారి తనిఖీ ప్రాంతం, PAC లు, రెస్ట్ హౌస్ లు, సత్రాలు, మఠాలు, కేంద్రీయ రిజర్వేషన్ కార్యాలయము, కళ్యాణ కట్ట అన్నదానము బస్టాండు మరియు ఇతర Vital installation లు ఇతరముల వద్ద సెక్యూరిటీ పనితీరు గురించి, అక్కడ నిక్కచ్చిగా యాక్సెస్ కంట్రోల్ పద్ధతులు, క్యూ లైన్ మేనేజ్మెంట్ పద్ధతులు, ప్రత్యేకమైన ఎంట్రీ మరియు exit పద్ధతులు, యాత్రికుల లగేజీలను స్కానింగ్ & వ్యక్తులను తనిఖీ చేసే చెకింగ్ మరియు ఫ్రిస్కింగ్ పద్ధతులను గురించి.

6) IED (ప్రేలుడు పదార్థాల ) ల గురించి, వాటిని గుర్తించే పద్ధతుల గురించి చర్చించడం జరిగినది. 

7) అనుమానాస్పద వస్తువులు ఏ.. ఏ.. విధంగా ఉంటాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? అవి కగురించి ఎవరికి ఏ విధంగా తెలియచేయాలి? వెంటనే ఏమి చర్యలు తీసుకోవాలి?. 

8) అనుమానాస్పద వ్యక్తులు ఎవరు? ఎలావుంటారు? తారసపడితే వెంటనే ఏమి చర్యలు తీసుకోవాలి? ఎవరికి రిపోర్టు చేయాలి? అన్న విషయాల గురించి మాట్లాడుకొవడం జరిగింది.

9) వాటిని అమర్చి పేలుళ్లు జరిగితే జరిగే దుష్ప్రభావాల గురించి.

10) డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎమర్జెన్సీ ఏ వాక్యుయేషన్ ప్లాన్ గురించి.

11) టెర్రరిస్ట్ సంస్థలపై రహస్యంగా పనిచేస్తున్న సంస్థల గురించి, వాటి మీద పనిచేస్తున్న పోలీసు వ్యవస్థల గురించి

12) తిరుమలలో భద్రత వ్యవస్థలో అక్కడక్కడ కల చిన్న లోపాలను గురించి, వాటిని సరిదిద్ది, అధిగమించి రక్షణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం గురించి. 

13) సెక్యూరిటీ వ్యవస్థల జాగరోకత గురించి, వారికి పెంచుకోవలసిన అవగాహన గురించి .

14) అదేవిధంగా టిటిడిలో పని చేయు ఇతర సివిల్ డిపార్ట్మెంట్ ల యొక్క బాధ్యత గురించి మరియు వారు పెంచుకోవాల్సిన అవగాహన గురించి

15) తిరుమలలో పనిచేయు చివరి స్థాయి ( gross root) కార్మికులు వర్కర్లు, పనివారు ఇతరుల కు చేయవలసిన అవగాహన గురించి.

16) అనుమానాస్పద వస్తువుల తనిఖీ కోసం ఏ విధముగా ప్రతిరోజు ఏరియా డామినేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అందులో ప్రతి మూల మూలను శోధించడం జరుగుతుంది డస్ట్ బిన్ లు టాయిలెట్లు మ్యాన్ హోల్ లు మురికి కాలువలు పార్కింగ్ ప్రదేశాలు పాత వస్తువులను అక్రమంగా నిర్మించుకున్న షెడ్లు మొదలైనవి ప్రతిరోజు ఒక్కొక్క సెక్టార్లో తనకి నిర్వహించడం జరుగుతుంది. 

17) అదే విధముగా అనుమానాస్పద వ్యక్తులను నిలదీస్తూ ప్రశ్నించి వారి వివరాలను పాపిలోన్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా అక్కడికక్కడే తనిఖీ చేసి వారికి నేర చరిత్ర ఉందా లేదా అని నిర్ధారించడం అవుతుంది

18) అదేవిధంగా కొత్తవారు అనుమానితులు బయటి ప్రాంతాల వారు కనిపిస్తే వారిని క్షున్నముగా విచారించి వారిని ముందస్తు చర్యలలో భాగంగా బైండోవర్ చేయడం అయినది

19) అక్రమ హాకర్లను అక్రమ వలసదారులను సుమారు 800 మందికి పైగా గుర్తించి వారిని తిరుపతికి బలవంతంగా పంపించడం అయినది

20) అక్రమంగా నిర్మించుకున్న 150 కి పైగా షేడ్ లను కూల్చివేయడం అయినది.

21) స్థానికేతరులు అనగా బయటనుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు, వారి అందరి బయోడేటాలు సేకరించి, వారినీ యెన్యుమరేషన్ చేయడం జరుగుతోంది . వారి పూర్వపరాలు పాత నేర చరిత్రలను సిసిటిఎన్ఎస్ మరియు ఫింగర్ ప్రింట్ తనిఖీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.

22) అన్యమతస్తులు ఇతర రాష్ట్రాల వారిపై నిరంతర నిఘా ఉంటుంది అన్న పై విషయాలపై అవగాహన కల్పించడం అయినది

ఇలాంటి పరిస్థితులలో మన దేవదేవుని సన్నిధి అయినటువంటి తిరుమల పట్టణంలో ఈ టెర్రరిస్టు చర్యలకు ఎలాంటి అవకాశం లేకుండా గట్టి చర్యలను మనం చేపడుతున్నాం!

  •  ఇందులో భాగంగా అన్ని ఎంట్రీ పాయింట్లలో తనిఖీలు చెకింగ్ ఫ్రిస్కింగ్ చేస్తూ ఉన్నాము,
  • బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ బృందాలు అడుగడుగు తనిఖీ చేసుకున్నాయి,
  • పోలీసు పహారాలు, బీట్లు అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు ప్రతి రోజు జరుగుతూనే ఉంది,
  • ప్రతిరోజు సాయంత్రం కాగానే ఒక్కొక్క సెక్టార్ను తీసుకొని ఏరియా డామినేషన్ చేస్తూ ప్రతి మూల మూల నూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము.
  • పార్కులు, టాయిలెట్, డస్ట్ బిన్ , మ్యాన్ హోల్ లను కూడా వదలడం లేదు. 

మరి పౌరులుగా మరియు సివిల్ అధికారులుగా మిగిలిన వారికి బాధ్యత లేదా? అంటే, తప్పకుండా ఉంది

మీ వంతుగా మీరు ఏమి చేయాలి? అన్నది పైన తెలిపిన క్లాసులో మీకి విపులంగా చెప్పడం అయినది! అయినా ఒకసారి తిరిగి తెలియజేస్తాను.

  • కొత్త వ్యక్తులు అనగా బయటి ప్రాంతాల వారు బయటి రాష్ట్రాల వారు బయటి జిల్లాల వారు ఎవరు వచ్చిన వారి పూర్వాపరాలు తెలుసుకోకుండా వారికి పని ఇవ్వరాదు
  •  అది హోటల్ అయినా మఠము అయిన షాపు అయినా కాంట్రాక్టర్ అయినా రోడ్ వర్కర్ అయిన బిల్డింగ్ వర్కర్ అయిన ఎలాంటి పని ఇవ్వరాదు
  • ఇచ్చేముందు అతని పూర్వాపరాలు తప్పక తెలుసుకోవాలి.
  • ముందస్తుగా పోలీసులకు వివరాలు తెలియజేయాలి.
  • కూలీల ముసుగులో టెర్రరిస్టులు చేరుకునే అవకాశం ఉంది
  • కావున ఆ అవకాశం వారికి ఇవ్వకుండా గట్టి సమాధానం ఇవ్వవలసినది మీరు మాత్రమే!. 

అంతేకాక అనుమానాస్పద వస్తువులు, ఎక్కడైనా మరిచిపోయిన వస్తువులు, వదిలివేయబడ్డ వస్తువులు... ఏవైనా కనబడినపుడు, ఆ విషయం వెంటనే తమ తమ సూపర్వైజర్లు, ఉన్నతాధికారుల ద్వారా విజిలెన్స్, పోలీస్, బిడి టీం... వారికి తెలియజేయవలెను. అంతే తప్ప, దానిని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయరాదు.

  • Dial - 100 కు ఫోను ద్వారా కూడా తెలియజేయవచ్చు.

ప్రతి టిటిడి అధికారి కూడా తాను పనిచేయు ప్రదేశం లో....

  • యాక్సెస్ కంట్రోల్
  • అనగా ప్రవేశ మార్గాలు అన్ని రక్షణాత్మకముగా ఒకే మార్గం ద్వారా జరిగేలా ఉన్నాయా? లేదా ?
  • అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు అనగా క్యూ లైన్ మేనేజ్మెంట్
  • సెక్యూరిటీ డిప్లొయ్మెంట్
  • చెకింగ్, ఫ్రిస్కింగ్, బ్యాగేజ్ చెకింగ్ 

ఇలాంటి చర్యలు జరుగుతున్నాయా లేదా? అన్న విషయాన్ని బాధ్యత వహించ వలెను. 

ఎవరి పరిధిలో వారు పై విధంగా గట్టిగా సమర్థవంతంగా పనిచేయడం ద్వారా.... ఆ రాబోయే ముప్పును మనం సంయుక్తంగా మరియు సమర్థవంతంగా ఎదుర్కోగలం!

దీని కోసం మీ సహకారం ఎంతైనా అవసరం! 

  • మీకు అవగాహన కొరకే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అయినది .
  • దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి అధికారికి మరియు సిబ్బందికి,
  • ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Comments

-Advertisement-