పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై సమీక్ష
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై సమీక్ష
జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలి
రానున్న 20 రోజులు అత్యంత కీలకం
- మంత్రి నిమ్మల రామా నాయుడు
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కు సంబంధించి పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు.
స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్టు హౌస్ లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు సలహాదారు ఎమ్. వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సీ నరసింహ మూర్తి తో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతి పై మంత్రి సమీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ 30 కి నాటికి నీరు అందించాలని ఉద్దేశ్యం తో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని, ఎనిమిది ప్యాకేజీల తో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఆయా ప్యాజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనుల పురోగతి పై ప్యాకేజీ కింద వివిధ సూపరింటెండెంట్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనులు పురోగతి, ప్రస్తుత యదార్ధ స్థితి పై మంత్రి సమీక్షించడం జరిగింది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం లో వెనుకబడిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. ఇప్పటికే ఆమేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియ చేయగా, ఏ విధమైన వివరణ కోరడం జరిగింది వాటిని అందచెయ్యాలన్నారు. ఆయా ప్యాకేజీ కింద పనులు చేపట్టడం లో నిర్లక్ష్య వైఖరి ఉంటే, రొటీన్ పద్ధతిలో వివరణ కోరడం సముచితం కాదని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి చెయ్యడం కోసం 20 రోజుల సమయం ఉందని, ఈ 20 రోజులు అత్యంత కీలకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి, నీరు విడుదల చేయాలని లక్ష్యం తో ఉందని, మీరు దృష్టి పెట్టీ, సంకల్పం తో ముందుకు అడుగులు వేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని మంత్రి తెలిపారు. నిధులు మంజూరు విషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతి పై ఏజెన్సీస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.