కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిద్దుదాం...
కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిద్దుదాం...
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
• జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం.
• డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన...
కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ . కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
• రాజ్ విహార్ నుండి కలెక్టరేట్ వరకు కొనసాగిన భారీ ర్యాలీ .
• డ్రగ్స్ వద్దు... జీవితమే ముద్దు అనే బ్రౌచర్స్ ను ఆవిష్కరణ చేసిన డిఐజి , కలెక్టర్, ఎస్పీ.
• ర్యాలీలో ప్లకార్డులతో అవగాహన కల్పించిన పోలీసులు, విద్యార్దులు.
గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, నగర మేయర్ బి.వై.రామయ్య తదితరులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపియస్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలలో మాదకద్రవ్యాల నియంత్రణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నిర్వీర్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటంవల్ల ఒత్తిడి లాంటి పరిస్థితులు ఉండేవి కాదని, ప్రస్తుతం చిన్న కుటుంబాల వల్ల, తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడం వల్ల, ఒంటరి తనంతో మానవ సంబంధాలు దెబ్బ తిని, యువత ఇలాంటి అలవాట్లకు లోను అవుతున్నారని తెలిపారు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటే ఇలాంటి అలవాట్లకు ఆస్కారం ఉండదని డిఐజీ అభిప్రాయపడ్డారు. 1960లో రాష్ట్రంలో గంజాయి సాగు మొదలైందని, విశాఖపట్నం, గోదావరి ప్రాంతాల్లో శిలోన్ నుంచి వచ్చిన తమిళ కార్మికులు వారి వెంట తెచ్చుకున్న గంజాయి విత్తనాల తో ఈ సాగు మొదలైందని డీఐజీ తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వము మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డీఐజీ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ...
1989 నుండి న్ 26 వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం అవుతున్నాయని, ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిని నాశనం చేయకపోతే, మానవాళి మొత్తం నాశనం అయిపోతుందన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ రహిత సమాజాన్ని రూపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయన్నారు.. డ్రగ్స్ వాడకం వల్ల తాత్కాలిక ఆనందం మాత్రమే లభిస్తుందని, ఒత్తిడి వల్లో లేక ఆనందం లభిస్తుందనో డ్రగ్స్ వాడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత డ్రగ్స్ వాడకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.. గతంలో చదువుతో పాటు మనసుకు ఉల్లాసం కలిగేలా ఆటలు, సంగీతం ఇలాంటి ఏదో ఒక వ్యాపకం ఉండేదని, ప్రస్తుతం అలాంటివి లేకుండా చదువు మాత్రమే ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడి కిలోన ఇలాంటి అలవాట్లకు లోనవుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ క్రీడల లాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తే దురలవాట్లకు లోను కాకుండా ఉంటారని కలెక్టర్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వము మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.. ఇందులో భాగంగా మాదకద్రవ్యాలను నియంత్రించడం, ప్రజల్లో అవగాహన తీసుకురావడం,మాదకద్రవ్యాలు సేవించే వారికి రిహాబిలిటేషన్, చికిత్స అందించడం కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. జిల్లాలో ప్రతి నెలా మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.. ప్రతి పాఠశాలలోనూ, కళాశాలలోనూ విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ, శాశ్వతంగా బోర్డులను ఏర్పాటు చేసి ప్రతిజ్ఞను రాయించడం జరుగుతోందన్నారు.. మత్తు పదార్థాలు సరఫరా వినియోగంపై నిఘా ఉంచడం జరుగుతోందన్నారు ఎక్కడైనా మత్తుపదార్థాల సాగు, వినియోగం లాంటివి తెలిసినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.. మత్తు పదార్థాల బారిన పడకుండా, మంచి నడవడికను అలవర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థినీ విద్యార్థులు యువతకు సూచించారు మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ కోరారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మాట్లాడుతూ...
మాదకద్రవ్యాల వ్యసనాన్ని మొగ్గలోనే త్రుంచి వేయాలని సూచించారు. యువత మరియు కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా ,కళాశాల, పాఠశాలలలో ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గ్యోప్యంగా ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. సమాచారం అందించిన వారికి రివార్డులు కూడా అందజేస్తామన్నారు.
ఎక్కడైనా డ్రగ్స్ కలిగి ఉన్నా, సరఫరా చేస్తున్నా, సేవించిన వారి పై NDPS ACT ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలుంటాయన్నారు. 6 నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు. యువత డ్రగ్స్ మత్తులో పడితే దొంగతనాలు చేస్తారన్నారు. పెద్ద పెద్ద నేరాలు కూడా చేస్తారన్నారు. డ్రగ్స్ అలవాటు పడిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని సౌకర్యాలు కల్పించి కౌన్సిలింగ్ చేసి వారిని మాదక ద్రవ్యాల వినియోగం నుండి బయటకు తీసుకుని వచ్చి ఆరోగ్యవంతులను చేస్తామని తెలియజేశారు.
సమావేశాన్ని ఉద్దేశించి కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ , స్ఫూర్తి రిహాబిలిటేషన్ శివ శంకర్ , సైకియాట్రి స్ట్ డాక్టర్ చైతన్య కుమార్, విద్యార్థినులు జయశ్రీ , సాహితీ , నయోమిక లు మాదకద్రవ్యాల వినియోగం వాటి వలన జరిగే నష్టాల గురించి వివరించారు.
డ్రగ్స్ కు అలవాటుపడి, వ్యసనంగా మారిన వారికి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓపి 30 లో హెల్త్ పరంగా ట్రీట్ మెంట్ చేసి, కౌన్సిలింగ్ చేసి బాగు చేస్తారని సైక్రియాటిక్ డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.
అనంతరం డ్రగ్స్ వద్దు... జీవితం ముద్దు అనే బ్రౌచర్స్ ను డిఐజి , కలెక్టర్, ఎస్పీలు ఆవిష్కరించారు.
మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి కృషి చేస్తానని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.
తొలుత కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , డి ఐ జి కోయ ప్రవీణ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్ , కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు మేయర్ బి వై రామయ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు,అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్, ఇంచార్జి డిఆర్ఓ వెంకటేశ్వర్లు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఐసిడిఎస్ పిడి నిర్మల, మెప్మా పిడి నాగశివ లీల, డిఎంహెచ్ఓ డా.శాంతి కళ, డిఈఓ శామ్యూల్ పాల్, తదితరులు పాల్గొన్నారు.