రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాయచోటి ఘటనపై సోషల్ మీడియా, ఇతర ప్రసార మాద్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 రాయచోటి ఘటనపై సోషల్ మీడియా, ఇతర ప్రసార మాద్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు..

జిల్లా ఎస్పీ హెచ్చరిక

రాయచోటి, (పీపుల్స్ మోటివేషన్):- 

రాయచోటి ఘటన గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ హెచ్చరించారు.

జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసారమాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మరియు సామాజిక మధ్యమాలలో గ్రూప్ అడ్మిన్ లు ప్రతి సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని, మరియు ఒక వేళ ఆయా గ్రూపుల్లో తప్పుడు సమాచారం వస్తే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. రాయచోటి ఘటన గురించి ఈ నెల 3వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేశామని, ఈ విషయం గురించి కేంద్ర దర్యాప్తు బృందం విచారణ చేస్తున్నారు. కావున ఎటువంటి విషయాలు ఉన్నా అధికారికంగా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు తెలియజేస్తారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, ప్రజలు భయభ్రాంతులు కలిగించే ఊహాగానాలు, కథనాలు, దృశ్యాలు సృష్టించినా, పుకార్లు వ్యాప్తి చేసినా, ప్రసారం చేసినా షేర్ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ముఖ్యంగా మీడియా పాత్ర విలువైనదని పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఏదైనా విషయానికి సంబంధించి పోలీసు అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై, సృష్టిస్తున్న వారిపై, షేర్ చేస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జాతీయ భద్రతకు కు సంబందించిన విషయాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తీవ్రమైన నేరం గా పరిగనించబడుతుంది. మరియు చట్ట పరమైన పర్యావసనాలు కఠినంగా ఉంటాయి. కావున ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని ప్రమాణీకతను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ సూచించారు.

Comments

-Advertisement-