సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
- సుపరిపాలనలో తొలి అడుగు" ద్వారా ప్రజల్లో ఉన్న భయం, అశాంతత పోయి.. ఒక భరోసా, ప్రశాంతత వస్తోంది.
- ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
- డోనేకల్ గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలి
- రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
- విడపనకల్ మండలం డోనేకల్ గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
అనంతపురం, జులై 05 :
- "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. శనివారం ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం డోనేకల్ గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ముందుగా మంత్రికి పెద్ద ఎత్తున గ్రామస్థులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
- ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, కుటుంబంలో వారు పొందిన లబ్ధి వివరాలను ఆప్యాయంగా అడిగి సావధానంగా మంత్రి తెలుసుకున్నారు.
- ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెపల్లెలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, ఒక నమ్మకాన్ని కల్పిస్తోందని, గత ఐదేళ్లలో వారిలో ఉన్న భయం, అశాంతత పోయిందని, ఒక భరోసా, ప్రశాంతత వచ్చిందన్నారు. గతంలో మాకు వస్తున్న పథకాలు ఏమవుతున్నాయో అనే దాని నుంచి ప్రజలు నేరుగా వచ్చి మాకు సమస్యలు తెలిపే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. డోనేకల్ గ్రామంలో తాగునీటి పైప్ లైన్ వేయలేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, 10, 15 రోజుల్లో సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలన్నారు. అభివృద్ధిపై తాము దృష్టి పెట్టామని, సంక్షేమంలో గత ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తేడాని గమనిస్తే.. గ్రామంలో గతంలో 220 మందికి అమ్మఒడి పడితే, తమ ప్రభుత్వంలో 430 మందికి తల్లికి వందనం పడుతోందని, సంక్షేమంలో రెట్టింపు ఇస్తున్నామన్నారు. పెన్షన్ గతంలో 250 పెంచితే తాము 1,000 రూపాయలు పెంచామని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం ఏ రోజు విడుదల చేస్తుందో అప్పుడే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని, గత ఐదేళ్లలో గ్రామంలో రోడ్లని తవ్వి వదిలేశారని, తాము జాతీయ రహదారి అయిన అత్యవసరంగా తారురోడ్డుని వేయించామన్నారు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ తమ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈరోజు గ్రామాల్లో తాము తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉందని, ప్రజలు మాపై నమ్మకం చూపిస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం చూపించేందుకు ముందుకు వెళుతున్నామని, కష్టానికి ప్రతిఫలం కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రశాంతంగా, ప్రజలకు స్వేచ్ఛని కల్పించే ప్రభుత్వం తమదన్నారు. ధాన్యం పండించే జిల్లాలైన గుంటూరు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాల్లో నెలల పాటు గతంలో బకాయిలు చెల్లించలేదని, రైతుల నుంచి ధాన్యం తీసుకున్న 48 గంటలలోపు తాము పేమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. సీఎం ఆదేశాలతో రైతులు నష్టపోరాదని బర్లీ పొగాకును తాము కొంటున్నామని, మామిడి ధర పడిపోవడంతో అదనంగా డబ్బులు పెట్టి కొంటున్నామన్నారు. ఎక్కడ కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉన్నాయో అక్కడ తమ ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. ఇవాళ హంద్రీనీవాని 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, ఆ తర్వాత పిల్ల కాలువలు కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments