ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా సీఎం
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా సీఎం
ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రపంచ వేదికపై తెలుగు పాటకు ఖ్యాతిని తీసుకొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ కి కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఆ మేరకు ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.