రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణపై స్పెషల్ ఫోకస్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 విశాఖ రుషికొండ బీచ్ సుందరీకరణపై స్పెషల్ ఫోకస్

  • మంత్రి కందుల దుర్గేష్ నిశిత పరిశీలనతో పరిశుభ్రంగా దర్శనమిస్తున్న విశాఖ ఆర్ కే బీచ్
  • ఎప్పటికప్పుడు బీచ్ సుందరీకరణపై ప్రధాన దృష్టి.. అధికారులతో చర్చలు
  • ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ పై దుష్ప్రచారం తగదని హెచ్చరిక
  • కలకాలం బ్లూఫ్లాగ్ గుర్తింపు కొనసాగేలా కూటమి ప్రభుత్వం చర్యలు
  • కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆర్కే బీచ్ లో క్రమంగా పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య


అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టిసారించారు. కలకాలం బ్లూఫ్లాగ్ గుర్తింపు కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇవే గాక రాష్ట్రంలో మరిన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ బీచ్ క్లీన్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పర్యాటకులు అధికంగా వచ్చే ఆర్ కే బీచ్ లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీచ్ లో సుందరీకరణకు పెద్దపీట వేయాలని ఇప్పటికే పర్యాటక శాఖ తరపున రూ.24 లక్షలు కేటాయించిన విషయం విదితమే. 

మంత్రి కందుల దుర్గేష్ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ నిత్యం బీచ్ పరిసర ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణ, మురుగు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో పర్యాటకులకు సైతం తాము తాగి పడేసిన బాటిళ్లు, తిని పడేసిన ప్లేట్లు డస్ట్ బిన్ లో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ క్షేత్రస్థాయి సందర్శన కోసం విశాఖ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, విశాఖలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సీనియర్ సైంటిస్ట్, రూరల్ వాటర్ సప్లై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ 2, జీవీఎంసీ జోనల్ కమిషనర్ 3, ప్లాటైపస్ ఎస్కేప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, లెవిన్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. బీచ్ తీర ప్రాంతంలో తరుచూ సముద్రపు వ్యర్థాలు, మురుగు సముద్రంలో కలవకుండా నాలా అవుట్ ఫాల్స్ ను గుర్తించి తొలగింపుకు తగు చర్యలు తీసుకునేందుకు కమిటీ పనిచేస్తోంది. చెత్త ఒడ్డుకు చేరకుండా నిరోధించేందుకు యంత్రాలు ఏర్పాటు చేసి తద్వారా బీచ్ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారానికి కమిటీ శ్రమిస్తుంది. అదే విధంగా బీచ్‌లో పర్యాటక సందడి పెరగడానికి మంత్రి దుర్గేష్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాక విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు, నగరవాసులకు డబుల్ డెక్కర్ బస్సుల్లో నగర విహారం చేసేలా అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందించారు. పర్యాటకులు కేవలం బీచ్‌ల సందర్శనకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శించేలా టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరగడం విశేషం. ఈ విషయంలో పర్యాటక శాఖతో పాటు వివిధ శాఖల అధికారుల కృషి ప్రశంశనీయం. మరోవైపు ఎప్పటికప్పుడు జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో టూరిజం శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కాటలు సమీక్షలు నిర్వహించి విలువైన మార్గదర్శకత్వం అందిస్తూ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.

భారతదేశంలో కేవలం ఎనిమిది బీచ్‌లకు మాత్రమే బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ రుషికొండ బీచ్ ఒకటి. ప్రఖ్యాత డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ ఈఈ) సంస్థ ఈ గుర్తింపు అందించింది. ప్రతిష్టాత్మక బీచ్ పై కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ఖ్యాతిని పాడు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి బ్లూఫ్లాగ్ గుర్తింపు తాత్కాలిక రద్దవడంతో మంత్రి దుర్గేష్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి బీచ్ లో మళ్లీ పర్యావరణ సంరక్షణ మెరుగుపడేలా చర్యలు తీసుకొని గుర్తింపు తిరిగి దక్కేలా చొరవ చూపారు. అనంతరం బీచ్ ను స్వయంగా సందర్శించి స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పాత ఫోటోలు జత చేసి బీచ్ లో పరిశుభ్రత లోపించిందన్న సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదని భావించాలి. రాష్ట్ర బీచ్ పర్యాటకాన్ని బాగు చేసేందుకు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇచ్చి పర్యాటకాంధ్రప్రదేశ్ కు బాటలు వేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Comments

-Advertisement-