రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్రంలో మహిళా మణులను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రాష్ట్రంలో మహిళా మణులను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

• ఈ ఆర్థిక సంవత్సరంలో 30వేల మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలును తయారు చేయాలి

• రూ. కోటి టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దుదాం.

• LEAP ఆడిట్ వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అనే మాట అపోహ మాత్రమే

• పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది.  ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ. 


మహిళా మణులను ఆర్థికంగా శక్తివంతులను చేసి వారు గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లైవ్లీ హుడ్స్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిఫ్ యాక్సిలరేషన్ ప్రొగ్రాంను తాడేపల్లి లోని ఓ ప్రైవేటు కన్వేన్షన్ లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి LEAP కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వారిలో దాగున్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి వారిని బలమైన వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి మెప్మా చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 30వేల మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని చిన్న చిన్న వ్యాపార సంస్థలు నెలకొల్పి అంచెలంచెలుగా రూ. కోటి టర్నోవర్ సాధించే సంస్థలుగా రూపాంతరం చెందేలా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 

LEAP కార్యక్రమం ద్వారా ఈ ఏడాదిలో రాష్ట్ర మంతా ఆడిట్ నిర్వహించాలన్న లక్ష్యంతో ముందకు సాగుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అన్నారు. మహిళలు చాలా మంది ఆడిట్ లో పాల్గొంటే తమ కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందవన్న అపోహ లో ఉన్నారని, అది వాస్తవం కాదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. నేడు మన సోసైటీలో ఎన్నో విధాలుగా ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయని, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న సంకల్పం ఉండాలన్నారు. ఉదాహరణకు కుకింగ్, వివిద అంశాలపై అవగాహన కల్పించే వీడియోలు సైతం ఆదాయాన్ని సమకూర్చుతాయన్నారు. మన గ్రామంలో, మన పట్టణంలోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై శిక్షణ పొంది ఆదాయం ఆర్జించవచ్చన్నారు. 

 మెప్మా ఎండీ  ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారిని సంఘంలో ఒక గుర్తింపు కలిగిన వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి మెప్మా సిబ్బంది శక్తి వంచన లేకుండ పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు రుణాలు ఇప్పించడంతో బాధ్యత తీరిపోయిందనుకోకూడదని, వారి వ్యాపార ఉన్నతికి తమ వంతు సలహాలు, సహాయ సహకారాలు అందించాలన్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్ లలో LEAP ఆడిట్ చివరి దశకు వచ్చిందని, మిగిలిన 14 కార్పొరేషన్ లలో కూడా ఆడిట్ ను త్వరలోనే నిర్వహిస్తామని, అటుపై మన్సిపాల్టీలు, నగర పంచాయితీలలో దశల వారీగా నిర్వహిస్తామన్నారు. ఆడిట్ అంటే వ్యాపారంలో ఉన్న మహిళలకు మరింత మెళుకువలు అందించడం, వారిని ప్రోత్సహించడం వంటివి ఉంటాయని వివరించారు. మెప్మా సిబ్బంది సాధించిన విజయాలను మెమోంటల రూపంలో సంతృప్తి పడరాదని, మహిళా వ్యాపారవేత్తలు సమర్థవంతంగా తమ వ్యాపారాలను నిర్వహించేలా వారికి వెన్నుదన్నుగా నిలచినప్పుడే సంతృప్తి చెందాలని కోరారు. 

స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధిలోకి వచ్చిన పలువురు మహిళా వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన దీప్తి రెడ్డి వ్యాపార విస్తరణలో తన అభివృద్ధిని వివరిస్తూ డ్వాక్రా రుణం రూ. 2లక్షలతో బొటిక్ ను ప్రారంభించానని ఇప్పుడు 12 మందికి తానే ఉపాధి చూపించగలుగుతున్నానని, దాదాపు నెలకు రూ. 5లక్షలు సిబ్బందికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నానని గర్వంగా తెలిపారు. అలాగే విజయవాడకు చెందిన మరో వ్యాపారవేత్త రమాదేవి మాట్లాడుతూ సెమీ కుకింగ్ చపాతి పరిశ్రమ స్థాపించి నెలకు స్థిర ఆదాయం పొందుతున్నానని సంతోషం వెలిబుచ్చారు. విజయవాడకు చెందిన మరో మహిళా వ్యాపారవేత్త హైమా మాట్లాడుతూ చీరల మాన్యూపాక్చరింగ్ యూనిట్ ను డ్వాక్రా రుణం రూ. 60వేలతో ప్రారంభించానని ఇప్పుడు రూ. 3కోట్ల టర్నోవర్ కు చేరుకున్నానని వివరించారు. 

కార్యక్రమంలో ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్  వినోద్ కుమార్, భారత ఎస్‌ఎమ్‌ఈ ఫోరం డైరెక్టర్ జనరల్  సుష్మ మోర్తానియా, మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్  నాగ వేంకటేశ్వరరావు కోటిపల్లి  అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లు,. భారత ఎస్‌ఎమ్‌ఈ ఫోరం డైరెక్టర్ - శిక్షణ, నైపుణ్యం మరియు ఇంక్యూబేషన్  భవ్య శర్మ మెప్మా సిటీ మిషన్ మేనేజర్లు, సీఓలు, TE-LHలు మరియు ఎస్‌ఎంఎంలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

-Advertisement-