రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఐయమ్ ఏ మార్గదర్శి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఐయమ్ ఏ మార్గదర్శి

  • కుప్పంలో 250 పేద కుటుంబాల దత్తత
  • చెప్పడమే కాదు... ఆచరిస్తున్నా
  • ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్
  • కుటుంబాల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు... సర్వే
  • ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ అమలు
  • IAmMargadarsi పోస్టర్ ఆవిష్కరణ
  • పీ4పై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్

అమరావతి, జులై 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపు ఇస్తున్న నేను.. చెప్పడమే కాదు.. ఆచరించి చూపాలని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. ఈ కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రణాళిక రూపొందిస్తాను. ఐయామ్ ఏ మార్గదర్శి. సమాజంలో పేద-ధనికుల మధ్య అంతరాలు తగ్గించే ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్కడా చేపట్టలేదు. గతంలో జన్మభూమి స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు పేదలను ఆదుకునేందుకు పీ4 అమలుకు ప్రణాళికలు చేపట్టాం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాం. పేదలకు చేయూతనిచ్చే పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

నేటి బంగారు కుటుంబాలే... రేపటి మార్గదర్శులు

“పీ4లో భాగంగా బంగారు కుటుంబాలుగా నమోదైన వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇవాళ్టి బంగారు కుటుంబాలు.. రేపటి మార్గదర్శలుగా ఎదగాలన్నదే నా ఆలోచన. సాయం పొందిన సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ఈ కార్యక్రమం శాశత్వంగా ఉండిపోతుంది. చాలా మందికి మంచి ఆలోచనలు ఉంటాయి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యాలున్న వారు పేదరికం కారణంగా వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వారికి చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన నాకు.. పీ4 కార్యక్రమం మనస్సుకు చాలా దగ్గరగా ఉంది” అని చంద్రబాబు అన్నారు.

ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్..

“బంగారు కుటుంబాలుగా నమోదైన వారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. బంగారు కుటుంబాలు అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది.. వాళ్లు చేయగలిగే పనులేంటీ..? అనే అంశాలపై ఓ పది పాయింట్లతో కూడిన సర్వే చేపడుతున్నాం. వీరి అభివృద్ధికి ఏం చేస్తున్నామనే విషయాన్ని వివరించేందుకు ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికల ద్వారా వారి అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తాం. బంగారు కుటుంబాల స్థితిగతులపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేపట్టాలి." అని సీఎం అన్నారు.

ఆగస్టు 15 నుంచి పీ4 ఫేజ్-1

“ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి విడత ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు పని చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్ర స్థాయి ఉద్యోగి వరకు కృషి చేయాలి. బంగారు కుటుంబాలను.. మార్గదర్శులను గుర్తించే విషయంలో కొన్ని జిల్లాలు ఇంకా మెరుగ్గా పని చేయాలి. వచ్చే 15 రోజుల్లో దీని కోసం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కసరత్తు చేయాలి. ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.” అని సీఎం సూచించారు. జూమ్ కాన్ఫరెన్సు ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీఎం స్ఫూర్తితో తాను కూడా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. షాజహాన్ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ తరహా కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ప్రజా ప్రతినిధులు సీఎంకు హామీనిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-