జిల్లాలోని నిరుద్యోగ యువత కర్నూల్ కెరీర్స్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోండి
జిల్లాలోని నిరుద్యోగ యువత కర్నూల్ కెరీర్స్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోండి
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, సెప్టెంబర్ 10 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా నిరుద్యోగ యువత కర్నూల్ కెరీర్స్ (mykurnool.ap.gov.in) పోర్టల్ ను సద్వినియోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ లో తమ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చని, ఈ సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా అందించే సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.. నిరుద్యోగ యువత అందరూ ఈ పోర్టల్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగ యువత తమ పేర్లను ఈ క్రింది విధంగా పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చన్నారు.
Kurnoolcareers(mykurnool.ap.gov.in)-menu-register-job seeker
జాబ్ సీకర్ బటన్ పై క్లిక్ చేసి నిరుద్యోగ యువత మొబైల్ నెంబర్, మెయిల్ ద్వారా వారి వివరాలను నమోదు చేసుకుంటే, వారికి మెయిల్ ద్వారా నోటిఫికేషన్లు అందుతాయన్నారు.https://mykurnool.ap.gov.in /mykurnool / Kurnool/careers.apk ద్వారా మొబైల్ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.