రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి
రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి
- -జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
- దేవనకొండ మండలకేంద్రంలో మన గ్రోమోర్ యూరియా ఔట్లెట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, సెప్టెంబర్ 10 (పీపుల్స్ మోటివేషన్):-
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం దేవనకొండ మండలకేంద్రంలో మన గ్రోమోర్ యూరియా ఔట్లెట్ ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన గ్రోమోర్ యూరియా ఔట్లెట్ లో యూరియా సరఫరా, స్టాక్ లభ్యత, పంపిణీ విధానాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్ లను పరిశీలిస్తూ, ఈ నెలలో ఎన్ని బస్తాల యూరియా సరఫరా చేశారని వివరాలను కలెక్టర్ షాప్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఒకేసారి కాకుండా ఖరీఫ్ కు సంబంధించి యూరియా ఇప్పుడు తీసుకోవాలని, రబీ సీజన్ కు యూరియా మరలా వస్తుందని రైతులలో అవగాహన కల్పించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ కింద ఎన్ని ఓపి కేసులు రిజిస్టర్ అయ్యాయని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆరా తీశారు? ప్రస్తుతం వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ఎక్కువైనందున, రోగులకు సరైన వైద్యం అందించాలని, ఇందుకు సంబంధించి రిజిస్టర్ లు మెయింటైన్ చేయాలన్నారు. డ్రగ్ స్టోర్ ను కలెక్టర్ పరిశీలిస్తూ, రోగులకు మెడిసిన్ ఇచ్చే సమయంలో ఎక్స్పైర్ తేది చూసి ఇవ్వాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. క్యాజువాలిటీ లో వైరల్ ఫీవర్ తో అడ్మిట్ అయిన 7వ తరగతి విద్యార్థికి అందిస్తున్న వైద్య సేవల గురించి కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆరా తీశారు?? వైద్యులు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారని కలెక్టర్ బాలుని తండ్రిని అడిగి తెలుసుకున్నారు. 150 వరకు ఓపీ ఉందని, ల్యాబ్ టెక్నీషియన్ ఎందుకు లేరని కలెక్టర్ డిఎంహెచ్ఓ ను ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఈ అంశం పై వివరణ ఇవ్వాలని కలెక్టర్ డిఎంహెచ్ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. డెలివరీ వార్డు ను కలెక్టర్ పరిశీలిస్తూ వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు? కిట్లు అందచేశారా? డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా?? అని కలెక్టర్ తల్లులను అడిగి తెలుసుకున్నారు.
అంగన్‌వాడీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా మెయింటైన్ చేయాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ అంగన్వాడీ ని విజిట్ చేసిన సమయంలో పిల్లలు నిద్రపోతూ ఉండడంతో సిబ్బందితో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈరోజు ఎంతమంది వచ్చారు?వారికి మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా అని కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.. బరువు, ఎత్తు తక్కువ ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా అని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆరా తీశారు? అలాంటి పిల్లలు లేరని సిబ్బంది తెలిపారు..
అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పరిశీలిస్తూ, ట్యాంక్ లు తరచూ శుభ్రం చేయాలని, క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు... క్రమశిక్షణతో చదువుకోవడం, పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి ఒకరు కష్టపడి చదవాలని కలెక్టర్ తెలిపారు.. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.. మెనూ ప్రకారం రుచి, శుచి తో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డించాలని సూచించారు..పాఠశాల గదులలో పెయింటింగ్ కి సంబంధించిన ఎస్టిమేట్ లను సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆదేశించారు.
ఈదుల దేవరబండ గ్రామంలో ఉల్లి రైతులతో మాట్లాడిన కలెక్టర్
దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామంలో ఉల్లి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి పంట సాగు, అమ్మకాల గురించి రైతులతో ఆరా తీశారు. ఉల్లి నాణ్యతను పరిశీలించారు. ఉల్లికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 లు మద్దతు ధర అందిస్తోందని, రైతులు ఉల్లిని ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ యార్డుకు తీసుకు రావాలని కలెక్టర్ రైతులకు తెలియజేశారు. నాణ్యత బాగుంటే రూ. 12 ల కంటే ఎక్కువ ధర రావొచ్చని, పచ్చిగా ఉన్న , గ్రేడింగ్ చేయని ఉల్లి దూర ప్రాంతాలకు వెళ్లే లోపు చెడిపోతుందని తెలిపారు. గత సంవత్సరం దాదాపు దేశమంతా మన ఉల్లి అమ్మకం చేసామని, ప్రస్తుతం మహారాష్ట్ర మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లలో ఉల్లి పంట బాగా పండటం వలన మన ఉల్లికి మంచి రేటు రావడం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు కేజీ చొప్పున కొంటూ ఉన్నదని తెలిపారు. కావున రైతులు బాగా ఆరబెట్టినవి , గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ యార్డ్ కు తీసుకొని రావలసిందిగా కోరారు...
కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్ రామాంజనేయులు, దేవనకొండ మండలం వ్యవసాయ అధికారి ఉషా రాణి, తదితరులు పాల్గొన్నారు.